హుజురాబాద్‌ ఉపఎన్నిక తప్పదా.. మంత్రి సంచలన వ్యాఖ్యలు

దిశ, తెలంగాణ బ్యూరో: ఈటల రాజేందర్ మేక వన్నె పులి… బీసీ ముసుగు వేసుకున్న పెద్ద దొర ఈటల అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముదిరాజ్ అని చెప్పుకుంటున్న ఈటల వారి సంక్షేమం కోసం ఏనాడు మాట్లాడలేదని స్వప్రయోజనాల కోసమే మాట్లాడారని తెలిపారు. ముదిరాజుల సంక్షేమం కోసం పాటుపడింది సీఎం కేసీఆర్ మాత్రమేనని కొనియాడారు. రాజకీయ భిక్ష పెట్టింది కేసీఆర్ అని చెప్పుకుంటున్న […]

Update: 2021-05-04 02:36 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఈటల రాజేందర్ మేక వన్నె పులి… బీసీ ముసుగు వేసుకున్న పెద్ద దొర ఈటల అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముదిరాజ్ అని చెప్పుకుంటున్న ఈటల వారి సంక్షేమం కోసం ఏనాడు మాట్లాడలేదని స్వప్రయోజనాల కోసమే మాట్లాడారని తెలిపారు. ముదిరాజుల సంక్షేమం కోసం పాటుపడింది సీఎం కేసీఆర్ మాత్రమేనని కొనియాడారు. రాజకీయ భిక్ష పెట్టింది కేసీఆర్ అని చెప్పుకుంటున్న ఈటల… ఇప్పుడు చేస్తున్న ప్రకటనలు, అనుచిత వ్యాఖ్యలు ఆయన వ్యక్తిత్వం ఏంటో తెలుస్తోందన్నారు.

హుజురాబాద్‌లో ఈటలను గెలిపించింది టీఆర్ఎస్, కేసీఆర్ బొమ్మ అని గంగుల కమలాకర్ చెప్పారు. అక్కడ ఈటల కాదు టీఆర్ఎస్ తరఫున ఎవరిని నిలబెట్టిన గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే హుజురాబాద్‌లో కేడర్‌ను బలపరుస్తామని ఆయన స్పష్టం చేశారు. వ్యక్తులు వస్తూ పోతుంటారు కానీ, పార్టీ శాశ్వతమని.. మంత్రులు, ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని ఈటల పేర్కొనడం హాస్యస్పదం అన్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి వ్యాఖ్యలను పరిశీలిస్తే త్వరలోనే హుజురాబాద్‌ ఉపఎన్నిక లాంఛనం కానుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags:    

Similar News