ప్రైవేట్ సేవల్లో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ..!
దిశ, శేరిలింగంపల్లి: వైద్యో నారాయణ హరి. వైద్యుడు దేవుడి లాంటి వాడు అని దీనర్థం. కానీ ఇప్పుడు వైద్య సేవలు కాసులు కురిపించే కామధేనువుగా మారాయి. కాస్త నలతగా ఉందని ఆస్పత్రికి వెళితే చాలు జేబులు ఖాళీ అవుతున్నాయి. పరీక్షల పేరున ప్రాణాలు తోడేస్తున్నారు. జ్వరం వచ్చినా టెస్ట్ చేయాల్సిందే. కడుపు నొప్పి లేసినా పరీక్ష తప్పదు. డాక్టరు మాటే వేద వాక్కుగా భావిస్తారు. ఇదే అలుసు గా తీసుకుని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు కాసుల వేటలో […]
దిశ, శేరిలింగంపల్లి: వైద్యో నారాయణ హరి. వైద్యుడు దేవుడి లాంటి వాడు అని దీనర్థం. కానీ ఇప్పుడు వైద్య సేవలు కాసులు కురిపించే కామధేనువుగా మారాయి. కాస్త నలతగా ఉందని ఆస్పత్రికి వెళితే చాలు జేబులు ఖాళీ అవుతున్నాయి. పరీక్షల పేరున ప్రాణాలు తోడేస్తున్నారు. జ్వరం వచ్చినా టెస్ట్ చేయాల్సిందే. కడుపు నొప్పి లేసినా పరీక్ష తప్పదు. డాక్టరు మాటే వేద వాక్కుగా భావిస్తారు. ఇదే అలుసు గా తీసుకుని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు కాసుల వేటలో కోట్లు గడిస్తున్నాయి. రోజుకో చోట ఆస్పత్రులు పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడు వీధికో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి వెలుస్తోంది. వీటిలో చాలా ఆస్పత్రులు కనీస నిబంధనలు కూడా పాటించకుండా ఏర్పాటు అవుతున్నాయి.
2019 లెక్కల ప్రకారం హైదరాబాద్ మహానగరంలో సుమారు 5వేల వరకు ఆస్పత్రులు ఉన్నట్లు అంచనా. ఇక ఇప్పుడు ఆ సంఖ్య 7వేల వరకు చేరినట్లు సమాచారం. ఇవేగాక చిన్నా చితక పీఎంపీ, ఆర్ ఎంపీ కేంద్రాలు గల్లీకోటి ఉన్నాయి. కార్పొరేట్ ఆస్పత్రుల కాసుల వేటనగరంలో వేల సంఖ్యలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు ఉన్నాయి. వాటిలో కార్పొరేట్ ఆస్పత్రుల సంఖ్య కూడా వం దల్లో ఉంది. శేరిలింగంపల్లి మండలంలో 250 ఆస్పత్రులు ఉండగా, మరో 14 వరకు కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి.
అలాగే మరో 100 వరకు చిన్నా, పెద్ద క్లినిక్ లు ఉన్నాయి. అందులో ఈమధ్యకాలంలో 12 నకిలీ క్లినిక్ లపై వేటు వేశారు. అయితే ఈ పెద్దాసుపత్రుల్లో ఒక్కసారి చేరితే చాలు జేబులు ఖాళీ కావాల్సిందే. అత్యున్నత వైద్య సేవల పేరున నిలువుదోపిడీకి పాల్పడుతున్నారని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల గచ్చిబౌలి కేర్ ఆస్పత్రిలో జరిగిన ఘటన ఇందుకు నిదర్శనం. ఇదంతా నాణ్యానికి ఒకవైపు మాత్రమే. కార్పొరేట్ ఆస్పత్రుల్లో ప్రతీ చిన్నదానికి వేల రూపాయల నుంచి లక్షల్లో వసూళ్లు చేస్తూ రోగులను, వారి బంధువులను బతికి ఉండగానే జీవచ్చవాళ్లను చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఒక్కసారి ఆస్పత్రికి వెళితే ఒక్కో కుటుంబం మరో పదేళ్ల వరకు ఆర్థికంగా కోలుకోలేని దుర్భర స్థితిలోకి వెళుతున్నాయి.
నిబంధనలకు నీళ్లు..
ప్రైవేట్ ఆస్పత్రుల ఏర్పాటులోనూ ఎక్కడా నిబంధనలు పాటించడం లేదు. ఆస్పత్రి భవనం నిబంధనల నుంచి సౌకర్యాల కల్పన వరకు అన్నిచోట్ల నిబంధనలకు నీళ్లు వదులుతున్నారు. ఆస్పత్రి భవనం చుట్టూ అగ్నిమాపక వాహనం తిరిగేంత ఖాళీ స్థలం ఉండాలి. కానీ నగరంలో ఉన్న వేలాది ఆస్పత్రులు ఇరుకుఇరుకు స్థలాల్లోనే ఉన్నాయి. అదీగాక ఇళ్లమధ్యలోనే వంద పడక ఆస్పత్రులను ఏర్పాటు చేశారు. ఆస్పత్రులు ఏర్పాటైన భవనాలకు కనీస అనుమతులు లేవు. వాటిలో చాలావాటికి జీహెచ్ఎంసీ పర్మిషన్స్ కూడా లేవు. ఇలాంటి ఆస్పత్రులను ఏకంగా రాష్ట్ర మంత్రులు ప్రారంభించడం గమనార్హం.
అంతేగాక వాటిలో అ త్యున్నత వైద్య సేవలు అందుతాయని మంత్రులు కితాబు ఇచ్చేస్తున్నారు. కానీ సదరు ఆస్పత్రులు నిబంధనల ప్రకారం ఉన్నాయా..? జీహెచ్ఎంసీ పర్మిషన్స్, ఫైర్ సేఫ్టీ అనుమతులు, వైద్య ఆరోగ్యశాఖ నిబంధనలు పాటిస్తున్నారా అని తెలుసుకోకపోవడం వారి చిత్తశుద్ధికి నిదర్శనం. ఇవేవీ పట్టించుకోని నాయకులు రిబ్బన్ కట్ చేసేందుకు మాత్రం పోటీపడుతున్నారు ప్రమాదా లు జరిగితే అధికారులు చేసే హడావుడి అంతాఇంతా కాదు. ఇక ఆస్పత్రుల్లో అం దే సేవలు, ఆయా పరీక్షల కోసం తీసుకునే చార్జీల విషయంలోనూ అనేక ఆరోపణలు ఉ న్నాయి. రక్త మూత్ర పరీక్షల పేరున దోచుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. వీటిని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.
నూతనంగా ఏర్పాటైన వాటికి అనుమతులు లేవు..
శేరిలింగంపల్లి మండలంలో 250 వరకు ఆస్పత్రులు ఉన్నాయి. చాలా వరకు పర్మిషన్స్ ఉన్నాయి. నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఆస్పత్రుల్లో కొ న్నింటికి అనుమతులు లేవు. అన్ని సదుపాయాలు ఉంటేనే అనుమతులు ఇస్తున్నాం. అర్హతగల డాక్టర్లు, స్టాఫ్ ఉండాలి, స్కానింగ్ మెషిన్స్ కు పర్మి షన్స్ తీసుకోవాలి, అలాగే ల్యాబ్ టెక్నీషియన్స్ కు కూడా అర్హతలు ఉండాలి. -డాక్టర్ సృజన,అసిస్టెంట్ డీఎంహెచ్‌ఓ
నిబంధనలు పాటించిన వాటిని సీజ్ చేస్తాం..
నిబంధనలు పాటించని ఆస్పత్రుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాం. 15 మీటర్లకన్నా ఎత్తులో ఉన్న బిల్డింగ్ లు మా పరిధిలోకి వస్తాయి. లేదంటే జీహెచ్ఎంసీ వారే పర్మిషన్స్ ఇస్తారు. ఫైర్ సేఫ్టీ పర్మిషన్స్ ఇవ్వాలంటే అండర్ గ్రౌండ్ లో వాటర్ స్టోరేజీ ట్యాంక్, ఫైర్ అ లారం, బిల్డింగ్ చుట్టూ ఖాళీ స్థలంతో పాటు అగ్నిమాప క శాఖ నిబంధనలు పాటించాలి. లేని వాటికి నోటీసులు ఇచ్చి సీజ్ చేస్తాం. -శ్రీధర్ రెడ్డి, ఫైర్ సేఫ్టీ అధికారి