మరో వివాదంలో 'జబర్దస్త్' కమెడియన్ హైపర్ ఆది..
దిశ, హైదరాబాద్: హైపర్ ఆది.. ఈ పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. ఆది కామెడీ పంచులు, డైలాగులు జబర్దస్త్కే హైలైట్ గా మారాయి. అయితే కొన్నిసారు ఆది మితిమీరిన డైలాగులు పలువురు మనోభావాలను దెబ్బతీసేలా ఉంటాయన్నది వాస్తవం. ఈ నేపథ్యంలోనే హైపర్ ఆది పై తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీవీలో ప్రసారమైన ఓ కార్యక్రమంలో ఆది.. తెలంగాణ పండుగ బతుకమ్మ, దేవతగా పూజించే […]
దిశ, హైదరాబాద్: హైపర్ ఆది.. ఈ పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. ఆది కామెడీ పంచులు, డైలాగులు జబర్దస్త్కే హైలైట్ గా మారాయి. అయితే కొన్నిసారు ఆది మితిమీరిన డైలాగులు పలువురు మనోభావాలను దెబ్బతీసేలా ఉంటాయన్నది వాస్తవం. ఈ నేపథ్యంలోనే హైపర్ ఆది పై తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీవీలో ప్రసారమైన ఓ కార్యక్రమంలో ఆది.. తెలంగాణ పండుగ బతుకమ్మ, దేవతగా పూజించే గౌరమ్మతో పాటు తెలంగాణ యాస, భాషలను కించపరిచే విధంగా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఆది, స్క్రిప్ట్ రైటర్‌తో పాటు మల్లెమాల ప్రొడక్షన్‌పై చర్యలు తీసుకోవాలని ఎల్‌బీ నగర్ ఏసీపీ శ్రీధర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. గతంలోనూ హైపర్ ఆది డబుల్ మీనింగ్ డైలాగులు, హద్దుమీరిన కామెడీపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదులు అందిన విషయం విదితమే.