ఏపీ ఎక్కువ నీటిని వాడుకుందని ఫిర్యాదు
దిశ, న్యూస్ బ్యూరో: కృష్ణా జలాలను ఏపీ కోటా కంటే ఎక్కువ వాడుకుంటుందని తెలంగాణ నీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేశారు. గత నెలాఖరు నాటికి ఏపీ 38.562 టీఎంసీలను అదనంగా తరలించినట్లు వివరించారు. కేటాయించిన నీటి కంటే ఎక్కువగా వాడుకుంటున్నారని, కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదని బోర్డుకు ఫిర్యాదు చేసిన లేఖలో పేర్కొన్నారు. గత వాటర్ ఇయర్‌లో ఏపీ 653.614 టీఎంసీలను వాడుకుంటుదని, ఏపీ నీటి వాటా 614.962 […]
దిశ, న్యూస్ బ్యూరో: కృష్ణా జలాలను ఏపీ కోటా కంటే ఎక్కువ వాడుకుంటుందని తెలంగాణ నీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేశారు. గత నెలాఖరు నాటికి ఏపీ 38.562 టీఎంసీలను అదనంగా తరలించినట్లు వివరించారు. కేటాయించిన నీటి కంటే ఎక్కువగా వాడుకుంటున్నారని, కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదని బోర్డుకు ఫిర్యాదు చేసిన లేఖలో పేర్కొన్నారు. గత వాటర్ ఇయర్‌లో ఏపీ 653.614 టీఎంసీలను వాడుకుంటుదని, ఏపీ నీటి వాటా 614.962 టీఎంసీలు మాత్రమేనని లేఖలో వివరించారు. తెలంగాణ వాటా 316.798 టీఎంసీలు ఉన్నప్పటికీ 278.146 టీఎంసీలను మాత్రమే వాడుకుందని, ఏపీ 38 టీఎంసీలను ఎక్కువ వాడుకుంటే తెలంగాణ 38 టీఎంసీలను తక్కువగా డ్రా చేసుకుందని పేర్కొన్నారు.