హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్ హిమ కోహ్లి
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమ కోహ్లిని నియమిస్తూ కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో కొలీజియం సిఫారసుల మేరకు ప్రకటన వెలువడినా నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు మాత్రం గురువారం అధికారికంగా విడుదలయ్యాయి. ప్రస్తుతం చీఫ్ జస్టిస్‌గా ఉన్న జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ జనవరి 4వ తేదీన రిలీవ్ కానున్నారు. ఉత్తరాఖండ్ హైకోర్టు సీజేగా బదిలీ అయ్యారు. జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ రిలీవ్ అయ్యే […]
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమ కోహ్లిని నియమిస్తూ కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో కొలీజియం సిఫారసుల మేరకు ప్రకటన వెలువడినా నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు మాత్రం గురువారం అధికారికంగా విడుదలయ్యాయి. ప్రస్తుతం చీఫ్ జస్టిస్‌గా ఉన్న జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ జనవరి 4వ తేదీన రిలీవ్ కానున్నారు. ఉత్తరాఖండ్ హైకోర్టు సీజేగా బదిలీ అయ్యారు.
జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ రిలీవ్ అయ్యే సమయానికి జస్టిస్ హిమ కోహ్లి బాధ్యతలు స్వీకరించే అవకాశం లేనందున జస్టిస్ రామచంద్రరావు యాక్టింగ్ చీఫ్ జస్టిస్‌గా కొంతకాలం వ్యవహరించే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమ కోహ్లి. సమైక్య రాష్ట్రంలో సైతం హైకోర్టుకు ఇప్పటివరకు మహిళా ప్రధాన న్యాయమూర్తులెవరూ లేరు.