ఆర్జీవీకి షోకాజ్ నోటీసులు

దిశ, వెబ్ డెస్క్: రాంగోపాల్ వర్మకు తెలంగాణ హై కోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దిశ ఎన్ కౌంటర్ చిత్రాన్ని నిలిపివేయాలని హైకోర్టును నిందితుల కుటుంబ సభ్యులు ఆశ్రయించారు. ఎన్ కౌంటర్ మృతుల కుటుంబాలు ఇప్పటికే మనోవేదనకు గురవుతున్నాయని కోర్టుకు పిటిషనర్ తరపు న్యాయవాది కృష్ణమూర్తి తెలిపారు. ఈ చిత్రాన్ని నిర్మించి వారిని గ్రామంలో కూడా ఉండనివ్వకుండా చేస్తున్నారని కోర్టుకు తెలిపారు. చిత్రంలో వారిని దోషులుగా చూపే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. దిశ చిత్రం విడుదల […]

Update: 2020-11-24 04:38 GMT

దిశ, వెబ్ డెస్క్: రాంగోపాల్ వర్మకు తెలంగాణ హై కోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దిశ ఎన్ కౌంటర్ చిత్రాన్ని నిలిపివేయాలని హైకోర్టును నిందితుల కుటుంబ సభ్యులు ఆశ్రయించారు. ఎన్ కౌంటర్ మృతుల కుటుంబాలు ఇప్పటికే మనోవేదనకు గురవుతున్నాయని కోర్టుకు పిటిషనర్ తరపు న్యాయవాది కృష్ణమూర్తి తెలిపారు. ఈ చిత్రాన్ని నిర్మించి వారిని గ్రామంలో కూడా ఉండనివ్వకుండా చేస్తున్నారని కోర్టుకు తెలిపారు. చిత్రంలో వారిని దోషులుగా చూపే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. దిశ చిత్రం విడుదల కాకుండా స్టే ఇవ్వాలని కోర్టును ఆయన కోరారు. కాగా తదుపరి విచారణను రెండు వారాల పాటు కోర్టు వాయిదా వేసింది.

Tags:    

Similar News