ఫిట్​మెంట్​ 7.5 శాతం.. అడిగింది 63 శాతం

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ తొలి వేతన సవరణ కమిషన్​ నివేదిక విడుదలైంది. 32 నెలలపాటు కొనసాగిన అధ్యయనం గత నెల 31న సీఎస్​కు అందించిన విషయం తెలిసిందే. దీన్ని దాదాపు 28 రోజుల పాటు సీల్డ్​ కవర్​లోనే ఉంచిన అధికారులు.. బుధవారం ఉదయం విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల ఫిట్​మెంట్​ను 7.5 శాతంగా బిశ్వాల్​ కమిటీ రికమెండ్​ చేసింది. వాస్తవంగా ఉద్యోగులు మాత్రం 63 శాతం అడిగారు. పదవీ విరమణ వయస్సును 58 నుంచి 60 […]

Update: 2021-01-26 23:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ తొలి వేతన సవరణ కమిషన్​ నివేదిక విడుదలైంది. 32 నెలలపాటు కొనసాగిన అధ్యయనం గత నెల 31న సీఎస్​కు అందించిన విషయం తెలిసిందే. దీన్ని దాదాపు 28 రోజుల పాటు సీల్డ్​ కవర్​లోనే ఉంచిన అధికారులు.. బుధవారం ఉదయం విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల ఫిట్​మెంట్​ను 7.5 శాతంగా బిశ్వాల్​ కమిటీ రికమెండ్​ చేసింది. వాస్తవంగా ఉద్యోగులు మాత్రం 63 శాతం అడిగారు. పదవీ విరమణ వయస్సును 58 నుంచి 60 ఏండ్లకు పెంచాలని, కనీస వేతనం రూ. 19 వేలు, గరిష్ట వేతనం రూ. 1,62,700లుగా వేతన సవరణ కమిషన్​ సూచించింది. ఇక హెచ్​ఆర్​ఏ శ్లాబుల్లో మార్పులు చేసింది. 11, 13, 17,24గా నిర్ణయించారు. గతంలో ఉన్న స్లాబు రేట్లను తగ్గిస్తూ సూచించారు. గతంలో 12,14,20,30 శాతంగా ఉన్నాయి.

Fin PR

 

Tags:    

Similar News