కరోనాను ఈహెచ్‌ఎస్‌లో చేర్చండి
దిశ, హైదరాబాద్: కోవిడ్ వైద్య సేవలను ఈహెచ్ఎస్‌లో చేర్చి ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఉచితంగా కరోనా టెస్టులు చేయించాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ కోరింది. ఈ మేరకు జేఏసీ చైర్మన్ కారం రవీందర్ రెడ్డి, కన్వీనర్ మమత తదితరుల బృందం శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా కారం రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురువుతున్నట్లు తెలిపారు. కరోనా వైద్యసేవలు పొందుతున్న ఉద్యోగులకు […]
దిశ, హైదరాబాద్: కోవిడ్ వైద్య సేవలను ఈహెచ్ఎస్‌లో చేర్చి ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఉచితంగా కరోనా టెస్టులు చేయించాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ కోరింది. ఈ మేరకు జేఏసీ చైర్మన్ కారం రవీందర్ రెడ్డి, కన్వీనర్ మమత తదితరుల బృందం శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా కారం రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురువుతున్నట్లు తెలిపారు. కరోనా వైద్యసేవలు పొందుతున్న ఉద్యోగులకు ప్రత్యేక సెలవు మంజూరు చేయాలని, ప్రతి ప్రభుత్వ కార్యాలయం దగ్గర టెంపరేచర్ రికార్డ్ చేయడం, మాస్కులు ధరించిన వారినే లోనికి అనుమతించడం, శానిటైజర్లు తప్పనిసరిగా వినియోగించడం, ప్రతి వారం కార్యాలయ ఆవరణలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారి చేయాలని కోరినట్లు తెలిపారు. ఉద్యోగులను రొటేషన్ పద్ధతిలో కార్యాలయాలకు అనుమతించాలని, పట్టణ ప్రాంతాల్లో ఉన్న కార్యాలయాల్లో 5 రోజుల పనిదినాలు ప్రవేశపెట్టాలని కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో మామిళ్ల రాజేందర్, ఎనుగుల సత్యనారాయణ, పద్మాచారి, డా.మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.