‘మల్టీలెవల్ అవెన్యూ ప్లాంటేషన్ పై ఫోకస్ పెట్టాలి’

దిశ, తెలంగాణ బ్యూరో : నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, మల్టీ లెవల్ అవెన్యూ ప్లాంటేషన్ పై ఫోకస్ పెట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. పట్టణాలు, గ్రామాల్లో హరితహారం పనుల పురోగతిపై శుక్రవారం బీఆర్ కేఆర్ భవన్ లో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. వానాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో హరితహారం కార్యక్రమంపై తీసుకోవాల్సిన పలు అంశాలను అధికారులతో చర్చించారు. కాగా హరితహారానికి సంబంధించిన మొక్కలు, ఇతర […]

Update: 2021-06-11 09:27 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, మల్టీ లెవల్ అవెన్యూ ప్లాంటేషన్ పై ఫోకస్ పెట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. పట్టణాలు, గ్రామాల్లో హరితహారం పనుల పురోగతిపై శుక్రవారం బీఆర్ కేఆర్ భవన్ లో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. వానాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో హరితహారం కార్యక్రమంపై తీసుకోవాల్సిన పలు అంశాలను అధికారులతో చర్చించారు.

కాగా హరితహారానికి సంబంధించిన మొక్కలు, ఇతర సామగ్రి పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు సీఎస్ సోమేశ్ కుమార్ కు వివరించారు. ఈ సమీక్షలో అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, అటవీ శాఖ పీసీసీఎఫ్ శోభ, డోబ్రియల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News