‘మోడీ చాయ్ అమ్మింది చూడలేదు.. దేశాన్ని అమ్మితే నమ్మరా..?’
దిశ, వెబ్‌డెస్క్: టీపీసీసీగా రేవంత్ రెడ్డి నియామకం తెలంగాణ కాంగ్రెస్‌లో అంచనాలకు తగ్గట్టుగానే ప్రభావం చూపుతోంది. దీనికితోడు ఇప్పుడిప్పుడే హస్తం పార్టీ అధిష్టానం సోషల్ మీడియాలో బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే చాలా వరకు గ్రూపులు కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నాయి. ఇందులో భాగంగానే తెలంగాణ కాంగ్రెస్ ముందడుగు వేస్తోంది. అధికారిక ట్విట్టర్‌లో ఎప్పటి కప్పుడూ అప్‌డేట్స్ ఇస్తూ.. రాష్ట్రంలో టీఆర్ఎస్-కేంద్రంలో బీజేపీలను ఎండగడుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే గురువారం తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్‌లో.. ‘ఆయన […]
దిశ, వెబ్‌డెస్క్: టీపీసీసీగా రేవంత్ రెడ్డి నియామకం తెలంగాణ కాంగ్రెస్‌లో అంచనాలకు తగ్గట్టుగానే ప్రభావం చూపుతోంది. దీనికితోడు ఇప్పుడిప్పుడే హస్తం పార్టీ అధిష్టానం సోషల్ మీడియాలో బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే చాలా వరకు గ్రూపులు కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నాయి. ఇందులో భాగంగానే తెలంగాణ కాంగ్రెస్ ముందడుగు వేస్తోంది. అధికారిక ట్విట్టర్‌లో ఎప్పటి కప్పుడూ అప్‌డేట్స్ ఇస్తూ.. రాష్ట్రంలో టీఆర్ఎస్-కేంద్రంలో బీజేపీలను ఎండగడుతూనే ఉంది.
ఈ నేపథ్యంలోనే గురువారం తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్‌లో.. ‘ఆయన గారు చాయ్ అమ్మటం ఎవ్వరు చూడలేదు, కానీ అందరు నమ్ముతారు. అదే ఆయన గారు ఇప్పుడు అందరి కళ్ళ ముందే దేశాన్ని అమ్ముతున్నాడు, కానీ ప్రజలు ఎందుకు నమ్మడం లేదు?’ అంటూ మోడీని ఉద్దేశిస్తూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ చూసిన కాంగ్రెస్ శ్రేణులు కామెంట్లు చేస్తూ.. వారి వంతుగా అధికార పక్షాలపై విమర్శలు సంధిస్తున్నారు.