నేడు తెలంగాణ కేబినెట్ భేటీ
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సమీక్షించేందుకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ ఆదివారం భేటీ కానుంది. లాక్‌డౌన్‌ను రాష్ట్రవ్యాప్తంగా కొనసాగించాలా? లేక వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో సడలించాలా? అనే అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే, కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు నెలకొనగా, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకూ ఆశించినంత ఆర్థిక సాయం అందలేదు. ఈ క్రమంలో కేంద్రం నుంచి రావాల్సిన ప్యాకేజీ గురించి కూడా చర్చించనున్నట్టు తెలుస్తోంది. Tags: telangana […]
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సమీక్షించేందుకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ ఆదివారం భేటీ కానుంది. లాక్‌డౌన్‌ను రాష్ట్రవ్యాప్తంగా కొనసాగించాలా? లేక వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో సడలించాలా? అనే అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే, కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు నెలకొనగా, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకూ ఆశించినంత ఆర్థిక సాయం అందలేదు. ఈ క్రమంలో కేంద్రం నుంచి రావాల్సిన ప్యాకేజీ గురించి కూడా చర్చించనున్నట్టు తెలుస్తోంది.
Tags: telangana cabinet, cm kcr, corona, lockdown, cabinet meeting