ఇప్పుడిప్పుడే కోలుకుంటుంటే అరెస్ట్ చేస్తారా.. ఆయనకేమైనా కేసీఆర్‌దే బాధ్యత

దిశ, వెబ్‌డెస్క్: కుమ్రంభీం జిల్లా కాగజ్‌నగర్‌లో బీజేపీ నేత పాల్వాయి హరీష్ బాబును పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. దీంతో ఆయన అరెస్టుపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ స్పందించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… పాల్వాయి హరీశ్ బాబు అరెస్ట్ అప్రజాస్వామికం అన్నారు. ఇప్పుడిప్పుడే హరీశ్ బాబు కరోనా నుంచి కోలుకుంటుంటే అరెస్ట్ చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీశ్ బాబు ప్రాణాలకు ఏమైనా జరిగితే కేసీఆర్‌దే బాధ్యత […]

Update: 2021-04-18 03:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: కుమ్రంభీం జిల్లా కాగజ్‌నగర్‌లో బీజేపీ నేత పాల్వాయి హరీష్ బాబును పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. దీంతో ఆయన అరెస్టుపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ స్పందించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… పాల్వాయి హరీశ్ బాబు అరెస్ట్ అప్రజాస్వామికం అన్నారు. ఇప్పుడిప్పుడే హరీశ్ బాబు కరోనా నుంచి కోలుకుంటుంటే అరెస్ట్ చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీశ్ బాబు ప్రాణాలకు ఏమైనా జరిగితే కేసీఆర్‌దే బాధ్యత అని అన్నారు. గిరిజనుల కోసం పోరాడుతున్నవారిని కేసీఆర్ అణచివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నేతలను అరెస్ట్ చేయడం.. నెలల తరబడి జైల్లో పెట్టడం కేసీఆర్ పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.

Tags:    

Similar News