గిన్నిస్ రికార్టుల్లోకి నాగరాజు వ్యవహారం
దిశ, వెబ్‌డెస్క్: కనీవిని ఎరగని రీతిలో అవినీతికి పాల్పడిన కీసర తహసీల్దార్ నాగరాజు పేరును గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కించడానికి పలు స్వచ్ఛంద సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుకు దరఖాస్తు కూడా చేశారు. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న యూత్ ఫర్ యాంటీ కరప్షన్(వైఏసీ), జ్వాల సంస్థ సంయుక్తంగా అత్యంత ఎక్కువ లంచం తీసుకున్న అధికారిగా తహసీల్దార్ నాగరాజు పేరును గిన్నిస్ బుక్ లో ఎక్కించాలని ఆన్ లైన్‌లో దరఖాస్తు […]
దిశ, వెబ్‌డెస్క్: కనీవిని ఎరగని రీతిలో అవినీతికి పాల్పడిన కీసర తహసీల్దార్ నాగరాజు పేరును గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కించడానికి పలు స్వచ్ఛంద సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుకు దరఖాస్తు కూడా చేశారు.
అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న యూత్ ఫర్ యాంటీ కరప్షన్(వైఏసీ), జ్వాల సంస్థ సంయుక్తంగా అత్యంత ఎక్కువ లంచం తీసుకున్న అధికారిగా తహసీల్దార్ నాగరాజు పేరును గిన్నిస్ బుక్ లో ఎక్కించాలని ఆన్ లైన్‌లో దరఖాస్తు చేశారు. ప్రపంచంలో 20 మిలియన్ల లంచం తీసుకున్న ప్రభుత్వ ఉద్యోగి ఇతడే అయ్యి ఉంటాడని వైఏసీ అధ్యక్షుడు పల్నాటి రాజేందర్, జ్వాల సంస్థ అధ్యక్షుడు సుంకరి ప్రశాంత్ అన్నారు. కాగా ఓ భూపట్టా విషయంలో రూ.2కోట్లు లంచం డిమాండ్ చేసి రూ.1.10 కోట్లు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు కీసర తహసీల్దార్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన విషయం తెలిసిందే.
కాగా స్వచ్ఛంద సంస్థల విన్నపాన్ని గిన్నిస్ బుక్ సంస్థ స్పందించింది. ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారుల అవినీతిపై తమ వద్ద ఎలాంటి కేటగిరి లేదని పేర్కొంది. ప్రత్యేకంగా కేటగిరి ప్రారంభించే విషయాన్ని పరిశీలిస్తామని వివరించింది. ఏది ఏమైనా ఒక మండల అధికారి అంత భారీ స్థాయిలో అవినీతికి పాల్పడడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.