బిగ్ బ్రేకింగ్.. కోర్టు ఆదేశాలతో చంచల్ గూడ జైలుకు తీన్మార్ మల్లన్న
దిశ, తెలంగాణ బ్యూరో : తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌ను చిలకలగూడ పోలీసులు శనివారం కోర్టులో హాజరుపరిచారు. సిటీ సివిల్ కోర్టులో మల్లన్న బెయిల్ పిటిషన్ వేయగా, దాన్ని తిరస్కరించారు. 15 రోజులపాటు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చారు. అనంతరం పోలీసులు అతడిని చంచల్ గూడ జైలుకు తరలించారు. ఆయన సెప్టెంబర్ 9వ తేదీ వరకు రిమాండ్‌లో ఉండనున్నారు. కాగా మల్లన్న ఎలాంటి సూసైడ్ అటెంప్ట్ చేయలేదని, ఆయనపై ఐపీసీ సెక్షన్ 306, 511 పెట్టడంపై మల్లన్న […]
దిశ, తెలంగాణ బ్యూరో : తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌ను చిలకలగూడ పోలీసులు శనివారం కోర్టులో హాజరుపరిచారు. సిటీ సివిల్ కోర్టులో మల్లన్న బెయిల్ పిటిషన్ వేయగా, దాన్ని తిరస్కరించారు. 15 రోజులపాటు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చారు. అనంతరం పోలీసులు అతడిని చంచల్ గూడ జైలుకు తరలించారు. ఆయన సెప్టెంబర్ 9వ తేదీ వరకు రిమాండ్‌లో ఉండనున్నారు.
కాగా మల్లన్న ఎలాంటి సూసైడ్ అటెంప్ట్ చేయలేదని, ఆయనపై ఐపీసీ సెక్షన్ 306, 511 పెట్టడంపై మల్లన్న న్యాయవాది ఉమేష్ చంద్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా ఈ అంశాన్ని పరిశీలిస్తామని కోర్టు తెలిపింది.
ఇదిలావుండగా, చిలకలగూడ పోలీసులు మల్లన్నను ఏడు రోజుల కస్టడీకి కోరారు. మల్లన్నను జైలుకు తరలించడంతో ఆయన న్యాయవాది ఉమేష్ చంద్ర త్వరలో బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. శుక్రవారం రాత్రి మల్లన్నను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.