కోమా పేషెంట్‌ను మేల్కొలిపిన చికెన్
దిశ, వెబ్‌డెస్క్ : నాన్‌వెజ్ ప్రియులు ఎక్కువగా ఇష్టపడేది ‘చికెన్’. ఆ ఘుమఘుమలు వస్తే చాలు.. వారి కడుపు నిండిపోతోంది. అయితే వాసనే కాదు, చికెన్ పేరు చెప్పగానే కోమాలో ఉన్న ఓ పేషెంట్ టక్కున లేచి కూర్చున్నాడు. నమ్మలేకపోతున్నారా? తైవాన్‌లోని ఓ హాస్పిటల్‌లో ఇటీవలే జరిగిన ఈ సంఘటన గురించి తెలుసుకోవాల్సిందే. తైవాన్‌కు చెందిన పద్దెనిమిదేళ్ల కుర్రాడు చియూ.. బైక్‌పై వెళుతూ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఒళ్లంతా గాయాలవడంతో పాటు తీవ్రంగా రక్తస్రావమైంది. ఇంటర్నల్ ఆర్గాన్స్‌లో […]
దిశ, వెబ్‌డెస్క్ :
నాన్‌వెజ్ ప్రియులు ఎక్కువగా ఇష్టపడేది ‘చికెన్’. ఆ ఘుమఘుమలు వస్తే చాలు.. వారి కడుపు నిండిపోతోంది. అయితే వాసనే కాదు, చికెన్ పేరు చెప్పగానే కోమాలో ఉన్న ఓ పేషెంట్ టక్కున లేచి కూర్చున్నాడు. నమ్మలేకపోతున్నారా? తైవాన్‌లోని ఓ హాస్పిటల్‌లో ఇటీవలే జరిగిన ఈ సంఘటన గురించి తెలుసుకోవాల్సిందే.
తైవాన్‌కు చెందిన పద్దెనిమిదేళ్ల కుర్రాడు చియూ.. బైక్‌పై వెళుతూ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఒళ్లంతా గాయాలవడంతో పాటు తీవ్రంగా రక్తస్రావమైంది. ఇంటర్నల్ ఆర్గాన్స్‌లో కూడా సీవియర్ బ్లీడింగ్ జరిగింది. చియూ పరిస్థితి చూసి బతకడం కష్టమేనన్న డాక్టర్లు.. మొత్తంగా ఆరు ఆపరేషన్లు చేసి చివరకు బతికించగలిగారు. చియూ ప్రాణమైతే తిరిగొచ్చింది కానీ అతడు కోమాలోకి వెళ్లిపోయాడు. ‘ఆ కుర్రాడు కోమాలోంచి ఎప్పుడు బయటకొస్తాడో చెప్పడం కష్టం, తమ వంతు ప్రయత్నం మాత్రం చేస్తామని’ తేల్చి చెప్పారు డాక్టర్లు. చియూ కోమాలోకి వెళ్లి అప్పటికే 62 రోజులు గడిచిపోయాయి. కానీ తనలో ఎటువంటి కదలిక లేదు.
సరిగ్గా.. 62వ రోజు అద్భుతం జరిగింది. హాస్పిటల్‌కు వచ్చిన చియూ సోదరుడు.. తమ్ముడిని ఆటపట్టిస్తున్నట్లుగా ‘బ్రో.. నీకు అత్యంత ఇష్టమైన చికెన్ ఫిల్లెట్ తింటున్నాను’ అని అన్నాడు. ఆ మాటలకు కోమాలో ఉన్న చియూ ఒక్కసారిగా స్పందించడంతో.. కుటుంబ సభ్యులు, అక్కడున్న డాక్టర్లు ఆశ్చర్యపోయారు. చచ్చుబడిపోయిన చియూ ఆర్గాన్స్.. తనకు ఇష్టమైన చికెన్ ఫిల్లెట్ అనే మాటకు స్పందించడంతో ఆ కుర్రాడు కోమా నుంచి విజయవంతంగా బయటపడ్డాడు. అలా చికెన్ ఫిల్లెట్ చియూకు ప్రాణాలు పోసింది. ప్రస్తుతం అతడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. తనను కాపాడినందుకు చియూ కుటుంబ సభ్యులు ఆస్పత్రి సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. నిజంగానే మన మనసు ఇష్టపడితే.. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, మన ఆర్గాన్స్ వాటికి అనుకూలంగా స్పందిస్తాయి. అనారోగ్యంగా ఉన్న వ్యక్తులు తమకు ఇష్టమైన వారిని చూడగానే.. కాస్త రిలీఫ్ పొంది త్వరగా కోలుకుంటారు. ఇది కూడా అలాంటిదే.. మనకు ఇష్టమైన ఫుడ్ కూడా మనల్ని రక్షిస్తుంది.