తేదీ ఎంటర్ చేస్తే చాలు.. డైరెక్ట్ ఆ రోజు మెసేజ్‌లు: WhatsApp కొత్త ఫీచర్
మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ తన వినియోగదారుల కోసం కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. వాట్సాప్ చాట్‌లో కావాల్సిన మెసేజ్‌లను సులభంగా సెర్చ్ చేయడానికి 'సెర్చ్ బై డేట్' అనే ఫీచర్‌ను అందిస్తుంది
దిశ, వెబ్‌డెస్క్: మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ తన వినియోగదారుల కోసం కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. వాట్సాప్ చాట్‌లో కావాల్సిన మెసేజ్‌లను సులభంగా సెర్చ్ చేయడానికి 'సెర్చ్ బై డేట్' అనే ఫీచర్‌ను అందిస్తుంది. దీని ద్వారా పాత మెసేజ్‌లను తేదీల వారీగా తిరిగి పొందవచ్చు. ఈ ఫీచర్ iOS స్మార్ట్‌ఫోన్‌లలో సరికొత్త 23.1.75 అప్‌డేట్‌తో అందుబాటులో ఉంది. మిగతా వినియోగదారులకు త్వరలో అందుబాటులోకి రానుంది.
ఈ ఫీచర్ ద్వారా చాట్ హిస్టరీలో పాత మెసేజ్‌లను సులభంగా పొందవచ్చని కంపెనీ పేర్కొంది. ఇంతకుముందు పాత మెసేజ్‌ను పొందాలంటే ప్రతి మెసేజ్‌ను చూడాల్సి వచ్చేది, దీని వలన చాలా సమయం పడుతుంది. అదే ఈ కొత్త ఫీచర్‌తో డైరెక్ట్ తేదీ ఎంటర్ చేయగానే ఆ రోజుకు సంబంధించిన మెసేజ్‌లను సులువుగా పొందవచ్చు. WhatsApp చాట్‌లో సెర్చ్ ఆప్షన్‌లో వెళ్లాక, క్యాలెండర్ కనిపిస్తుంది. మీకు కావాల్సిన సంవత్సరం, నెల, తేదీ ని సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ఎంటర్ చేసిన తేదీలో ఉన్న మెసేజ్‌లు డిస్‌ప్లై పైన కనిపిస్తాయి.