గంటలో 60 వేల అమ్మకాలు సాధించిన నథింగ్ స్మార్ట్‌ఫోన్

లండన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ నథింగ్ నుంచి వచ్చిన ఫోన్ (2a) మోడల్ విడుదలైన 60 నిమిషాల్లో 60,000 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసిందని కంపెనీ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది.

Update: 2024-03-12 13:38 GMT

దిశ, టెక్నాలజీ: లండన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ నథింగ్ నుంచి వచ్చిన ఫోన్ (2a) మోడల్ విడుదలైన 60 నిమిషాల్లో 60,000 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసిందని కంపెనీ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. విపరీతమైన డిమాండ్ నేపథ్యంలో విక్రయాల పరంగా సరికొత్త మైలురాయికి చేరుకుందని అధికారులు తెలిపారు. నథింగ్ ఫోన్ (2a) బ్లాక్ అండ్ వైట్ కలర్ వేరియంట్లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. లాంచ్ ఆఫర్‌లో భాగంగా దీని ప్రారంభ ధర రూ.19,999. ఫోన్ 8GB RAM+128GB స్టోరేజ్‌తో పాటు, 8GB RAM+256GB, 12GB RAM+256GB స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది.

ఈ మోడల్ 6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని రిఫ్రెష్ రేట్ 120 Hz. ఫోన్ Mediatek డైమెన్సిటీ 7200 ప్రో చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. దీనిలో 50MP(OIS)+50MP బ్యాక్ కెమెరాలను అందించారు. అలాగే, ముందు సెల్ఫీల కోసం 32MP కెమెరా ఉంది. ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారంగా రన్ అవుతుంది. ఫోన్ 45W ఫాస్ట్ చార్జింగ్‌ సపోర్ట్‌తో 5000 mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది కేవలం 20 నిమిషాల్లో 50 శాతం చార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంటుంది.


Similar News