Tecno నుంచి రాబోతున్న Pova 5 సిరీస్

టెక్నో కంపెనీ నుంచి Tecno Pova 5 సిరీస్ ఫోన్‌‌లు భారత మార్కెట్లోకి విడుదల కానున్నాయి.

Update: 2023-07-26 12:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: టెక్నో కంపెనీ నుంచి Tecno Pova 5 సిరీస్ ఫోన్‌‌లు భారత మార్కెట్లోకి విడుదల కానున్నాయి. ఈ కామర్స్ సైట్ అమెజాన్ ద్వారా అమ్మకానికి వస్తాయి. ఆగస్టు 14న వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని కంపెనీ ప్రకటించింది. Tecno Pova 5 ఫోన్ 6.78-అంగుళాల IPS LCD పంచ్-హోల్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. ఇది MediaTek Helio G99 SoC ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. HiOS 13 ఆధారిత Android 13 పై రన్ అవుతుంది. ఫోన్ బ్యాక్ సైడ్ 50-మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సిస్టమ్, ముందు సెల్ఫీల కోసం 8-మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫోన్ 45W చార్జింగ్‌కు సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది. దీని ధరను కంపెనీ ఇంకా నిర్ధారించలేదు.


Similar News