రూ. 12 వేల ధరలో Tecno కొత్త స్మార్ట్‌ఫోన్

Tecno కంపెనీ నుంచి Pova 5, Pova 5 Pro స్మార్ట్‌ఫోన్‌లను ఆగస్టు 11న ఇండియాలో ఆవిష్కరించారు

Update: 2023-08-14 10:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: Tecno కంపెనీ నుంచి Pova 5, Pova 5 Pro స్మార్ట్‌ఫోన్‌లను ఆగస్టు 11న ఇండియాలో ఆవిష్కరించారు. ఇటీవల వాటి అమ్మకాల తేదీలను కంపెనీ ప్రకటించింది. ఈ ఫోన్‌లు అమెజాన్ ద్వారా ఆగస్టు 22 నుండి దేశంలో అమ్మకానికి ఉంటాయి. Pova 5 ప్రారంభ ధర రూ. 11,999. Pova 5 Pro ధర రూ.14,999. కొనుగోలు సమయంలో రూ. 1000 తగ్గింపు కూడా లభిస్తుంది. వినియోగదారులు 6 నెలల వరకు నో-కాస్ట్ EMI ఎంపికను కూడా పొందవచ్చు.

Tecno Pova 5 సిరీస్ 6.78-అంగుళాల పూర్తి-HD+ డిస్‌ప్లేలతో 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో వస్తుంది. Pova 5 MediaTek Helio G99 SoC ద్వారా పనిచేస్తుంది. Pova 5 Pro ఆక్టా-కోర్ MediaTek డైమెన్సిటీ 6080 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. రెండు ఫోన్లు కూడా ఆండ్రాయిడ్ 13-ఆధారిత HiOS స్కిన్‌తో రన్ అవుతాయి.

రెండింటిలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, AI లెన్స్‌‌ను అందించారు. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా Pova 5 సిరీస్‌లో అమర్చారు. Pova 5 ఫోన్‌లో 6,000mAh బ్యాటరీని అందించారు, ఇది 45W ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తోంది. అదే Pova 5 Pro 5,000mAh బ్యాటరీతో 68W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను అందజేస్తుందని కంపెనీ పేర్కొంది.


Similar News