Youtube: యూట్యూబ్ యూజర్లకి షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన ప్రీమియం ఛార్జీలు
యూట్యూబ్ యూజర్లకి షాకింగ్ న్యూస్
దిశ, వెబ్ డెస్క్ : ఈ మధ్య యువత దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ఏదొక విధంగా వారి ట్యాలెంటును బయట పెట్టుకునేందుకు వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ ను బాగా వాడుతున్నారు. వాటిలో యూట్యూబ్ ముందుంది. ఎందుకంటే .. ప్రతీ క్షణం అనేక వీడియోలు అప్‌లోడ్ అవుతూనే ఉంటాయి. బ్రేకింగ్ దగ్గర నుంచి అన్ని మూవీ అప్డేట్స్ కి సంబంధించిన వీడియోలను మీరు దీనిలో చూడవచ్చు. దీంతో చాలా మంది లక్షలు సంపాదిస్తున్నారు.
ఈ క్రమంలోనే యూట్యూబ్ కొత్త కొత్త సేవలను అందుబాటులోకి తెచ్చింది. దీనిలో మంచి కంటెంట్‌తో పాటు, క్లారిటీ ఉన్న వీడియోలను కూడా చూడొచ్చు. అయితే, ఇక్కడే ఒక ప్రీమియంను కూడా యూజర్స్ కోసం తెచ్చింది. ఈ సేవలను ఉపయోగిస్తున్న వారికి షాకింగ్ న్యూస్ చెప్పింది. ప్రీమియం ఛార్జీలను ఇంతకముందు కంటే ఎక్కువ పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
యూట్యూబ్ ప్రీమియం ఛార్జీలను ఒకేసారి రూ. 200 వరకు పెంచడం పెద్ద షాకింగ్. ప్రస్తుతం యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను 3 నెలలు, 12 నెలల ప్లాన్స్ ఉన్నాయి. పెరిగిన ధరలు ఇలా ఉన్నాయి.
30 రోజుల ప్లాన్ ధర రూ.129 నుంచి రూ.149కి పెరిగింది.
విద్యార్థి 30 రోజుల ప్లాన్ ధర రూ.79 నుంచి రూ.89కి పెరిగింది.
ఫ్యామిలీ నెలవారీ ప్లాన్ ధర రూ.189 నుంచి రూ.299కి పెంచింది.
వ్యక్తిగత ప్రీపెయిడ్ 30 రోజుల ప్లాన్ ధర రూ.139 నుంచి రూ.159కి పెరిగింది.
3 నెలల ప్లాన్ ధర రూ.399 నుంచి రూ.459కి పెరిగింది.