అంతరిక్షంలోకి మొదటి ముస్లిం మహిళా

ప్రముఖ రొమ్ము క్యాన్సర్ పరిశోధకురాలు రయ్యానా బర్నావి అంతరిక్షంలోకి ప్రయాణించబోతున్న మొదటి సౌదీ అరేబియా మహిళగా అవతరించనున్నారు.

Update: 2023-04-13 09:51 GMT

దిశ, ఫీచర్స్ : ప్రముఖ రొమ్ము క్యాన్సర్ పరిశోధకురాలు రయ్యానా బర్నావి అంతరిక్షంలోకి ప్రయాణించబోతున్న మొదటి సౌదీ అరేబియా మహిళగా అవతరించనున్నారు. ఫైటర్ పైలట్ సౌదీ అలీ అల్ కర్నీ, మాజీ నేషనల్ ఏరోపాటినిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఆస్ట్రోనట్ పెగ్గీ విట్సన్, టెన్నసీకి చెందిన బిజినెస్‌మన్ టెన్నసీతో కలిసి ఈ ప్రైవేట్ మిషన్‌లో భాగం కానుంది. కాగా ఈ స్పేస్ జర్నీకి టెన్నసీ పైలట్‌గా వ్యవహరించనున్నట్లు నాసా అఫిషియల్స్ ప్రకటించారు. నలుగురు సభ్యులతో కూడిన సిబ్బంది మే 8న ఫ్లోరిడా నుంచి స్పేస్‌ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్‌లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS)కి వెళ్లనున్నారు. ఇది ప్రైవేట్ స్పేస్ కంపెనీ యాక్సియమ్ స్పేస్ రెండవ మిషన్ ప్రారంభానికి గుర్తుగా ఉండనుంది. ఈ ట్రిప్‌ను సౌదీ అరేబియా తన అల్ట్రా-కన్సర్వేటివ్ ఇమేజ్‌ని పునరుద్ధరించడానికి తాజా ప్రయత్నంగా పరిగణించబడుతుంది.

ఇక ఈ పర్యటనలో యాక్సియమ్ మిషన్ 2 (యాక్స్-2) మిషన్ స్పెషలిస్ట్‌గా వ్యవహరించనున్న రయ్యానా బర్నావి.. న్యూజిలాండ్‌లోని ఒటాగో విశ్వవిద్యాలయం నుంచి బయోమెడికల్ సైన్సెస్‌లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పొందారు. సౌదీ అరేబియాలోనే బయోమెడికల్ సైన్సెస్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. బ్రెస్ట్ క్యాన్సర్, స్టెమ్-సెల్ క్యాన్సర్ పరిశోధనలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న ఈ రీసెర్చ్ లాబొరేటరీ టెక్నీషియన్.. 10 రోజుల మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లనున్న మొదటి ముస్లిం మహిళా వ్యోమగామిగా చరిత్ర సృష్టించనున్నారు.

‘ఈ ప్రత్యేక రోజున అంతరిక్ష పరిశోధనలో మానవాళి సాధించిన విజయాలను మేము గుర్తుంచుకుంటాం. దేశాల మధ్య మరింత సంపన్నమైన సహకార భవిష్యత్తును నిర్మించడానికి మేము ఎదురుచూస్తున్నాం. సౌదీ వ్యోమగాముల బృందంగా, ఈ శాస్త్రీయ, నాగరికత ప్రాజెక్ట్‌లో పాల్గొనడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. మా ప్రియమైన దేశ ఆకాంక్షలను సాధించడానికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నాం’ అంటూ బర్నావి ట్వీట్ చేసింది. 

Tags:    

Similar News