4కె వీడియో రికార్డింగ్‌తో ఎఫ్25 ప్రొ 5జీ లాంచ్ చేసిన ఒప్పో
ముందు, వెనుక 4కె వీడియో రికార్డింగ్, మీడియాసెట్ డైమన్సిటీ 7050 చిప్‌సెట్‌తో వస్తుందని కంపెనీ తెలిపింది.
దిశ, టెక్నాలజీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ బ్రాండ్ ఒప్పో భారత మార్కెట్లో తన కొత్త ఎఫ్25 ప్రో 5జీని విడుదల చేసింది. మిడ్-రేంజ్ ధరలో తీసుకొచ్చిన ఈ ఫోన్ అత్యాధునిక ఫీచర్లతో లభిస్తుందని కంపెనీ చెబుతోంది. ముఖ్యంగా ముందు, వెనుక 4కె వీడియో రికార్డింగ్, మీడియాసెట్ డైమన్సిటీ 7050 చిప్‌సెట్, 6.7 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుందని కంపెనీ తెలిపింది. నాణ్యమైన ఫోటోలు తీసుకునేందుకు స్మార్ట్ ఏఐతో పాటు బార్డర్‌లెస్ డిస్‌ప్లే లాంటి కొత్త ఫీచర్లు ఇందులో అందించినట్టు పేర్కొంది. అద్భుత పనితీరుతో పాటు తక్కువ బరువు, స్లిమ్, డ్యూరబుల్ స్మార్ట్‌ఫోన్‌గా దీని డిజైన్ వినియోగదారులను ఆకట్టుకుంటుందని కంపెనీ వివరించింది. ఇక, ధరలకు సంబంధించి 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్‌తో కూడిన ఫోన్ ధర రూ. 23,999 ఉండగా, 8జీబీ, 256జీబీ వేరియంట్ ధర రూ. 28,999తో లభిస్తుంది. ఇది ప్రామాణిక 67వాట్ల సూపర్‌వూక్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కేవలం పది నిమిషాల్లో సున్నా నుంచి 30 శాతానికి, 48 నిమిషాల్లో 100 శాతానికి బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. మార్చి 5వ తేదీ నుంచి ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో అన్ని స్టోర్స్‌లో ఇది అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది.