OnePlus మొట్టమొదటి ఫోల్డబుల్ ఫోన్‌.. ధర తెలిస్తే షాక్!

వన్‌ప్లస్ కంపెనీ ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా తన మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ మోడల్ పేరు ‘వన్‌ప్లస్ ఓపెన్’

Update: 2023-10-20 10:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: వన్‌ప్లస్ కంపెనీ ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా తన మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ మోడల్ పేరు ‘వన్‌ప్లస్ ఓపెన్’. దీని 16GB RAM+ 512GB స్టోరేజ్ ధర రూ.1,39,999. ఎమరాల్డ్ డస్క్, వాయేజర్ బ్లాక్ కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది. ముందస్తు బుకింగ్స్‌ చేసుకోవచ్చు. అక్టోబర్ 27న అమ్మకానికి వస్తుంది. కొనుగోలు సమయంలో ఎంపిక చేసిన ఫోన్లను ఎక్స్ఛేంజ్ చేసుకుని రూ.8,000 తగ్గింపు పొందవచ్చు. అలాగే ICICI బ్యాంక్ కార్డు, OneCard ద్వారా రూ.5000 తగ్గింపు కూడా ఉంది.

వన్‌ప్లస్ ఓపెన్ ఫీచర్స్

* బయటి వైపు 6.31-అంగుళాల(1,116x2,484 పిక్సెల్‌లు) 2K సూపర్ ఫ్లూయిడ్ AMOLED స్క్రీన్‌ను అందించారు.

* లోపల 7.82-అంగుళాల(2,268x2,440 పిక్సెల్‌లు) 2K ఫ్లెక్సీ-ఫ్లూయిడ్ AMOLED రెండో డిస్‌‌ప్లే ఉంది.

* 120Hz డైనమిక్ రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ రెస్పాన్స్ రేట్

* ఆండ్రాయిడ్ 13 ఆధారంగా ఆక్సిజన్ OS 13.2పై రన్ అవుతుంది.

* Qualcomm స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్‌ సెట్ ద్వారా పనిచేస్తుంది.

* 64MP ప్రధాన కెమెరా, 48MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాను అమర్చారు.

* సెల్ఫీల కోసం బయట స్క్రీన్ వైపు 32MP, లోపల 20MP కెమెరా ఉంది.

* ఇది 67W చార్జింగ్‌తో 4,800mAh బ్యాటరీని కలిగి ఉంది.

Tags:    

Similar News