గూగుల్‌లో కొత్త ఫీచర్‌..ఇంగ్లిష్ గ్రామర్‌ మిస్టేక్‌లను ఈజీగా చెక్ చేసుకోవచ్చు?

చదువుకునే విద్యార్థులు తెలియని పాఠాలు కోసం గూగుల్‌లో సెర్చ్ చేసి తెలుసుకుంటారు

Update: 2023-08-09 06:11 GMT

దిశ,వెబ్ డెస్క్: మనం ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్లే టప్పుడు .. ఆ ప్రాంతం మనకు ఐడియా లేనప్పుడు మన స్మార్ట్ ఫోన్‌లో గూగుల్‌ మ్యాప్స్ ఆన్‌ చేసుకొని వెళ్తుంటాము. చదువుకునే విద్యార్థులు తెలియని పాఠాలు కోసం గూగుల్‌లో సెర్చ్ చేసి తెలుసుకుంటారు. ఇంగ్లీష్‌లో మనకి తెలియని పదాలను కూడా దీనిలోనే సెర్చ్ చేసి చూస్తుంటాము. ఇలా ప్రతిదానికి గూగుల్‌పై ఆధారపడుతుంటాము. గూగుల్‌ కూడా తమ వినియోగదారుల కోసం కొత్త కొత్త ఫీచర్లను ముందుకు తీసుకొస్తుంది. ఇప్పుడు కొత్తగా మరో ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇంగ్లీష్‌లో గ్రామర్‌ మిస్టేక్‌లను మనమే సరి చేసుకోవడం. ఆ ఫీచర్ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..

ఈ కొత్త ఫీచర్ ద్వారా మనం రాసిన గ్రామర్ మనమే చెక్ చేసుకోవచ్చు. దానిలో వాక్యాలు సరిగ్గా ఉన్నాయా? లేవా అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇప్పటి నుంచి థర్డ్ పార్టీ యాప్స్ అవసరం లేదు. అలాగే ప్రతి సారి గ్రామర్ చెక్ కోసం పేజ్‌ను ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. దానిని ఉపయోగిస్తున్నప్పుడు గ్రామర్ చెక్ అనే టూల్ పాప్ అప్ అవుతుంది. దాని ద్వారా మీరు ఒక వాక్యం ఎంటర్ చేయగానే అందులో గ్రీన్ చెక్ మార్క్ చూపిస్తుంది.. దానిలో ఏదైనా తప్పు ఉంటే రెడ్ మార్క్ చూపిస్తుంది. ఇందులో గ్రామర్ మాత్రమే కాకుండా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా అదే కరెక్ట్ చేస్తుంది. 

Tags:    

Similar News