సొగసైన డిజైన్‌తో Motorola Edge 50 Ultra.. ధర, ఫీచర్స్ ఇవే

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ మోటో ఇండియాలో కొత్త మోడల్‌ను మంగళవారం విడుదల చేసింది. దీని పేరు ‘Motorola Edge 50 Ultra’.

Update: 2024-06-18 13:54 GMT

దిశ, టెక్నాలజీ: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ మోటో ఇండియాలో కొత్త మోడల్‌ను మంగళవారం విడుదల చేసింది. దీని పేరు ‘Motorola Edge 50 Ultra’. సొగసైన డిజైన్‌తో మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో వచ్చింది. ఫొటోలను క్లారిటీతో తీస్తుందని కంపెనీ పేర్కొంది. 100X Super Zoom ఫీచర్‌ను ప్రత్యేకంగా ఇచ్చారు. 12GB RAM+512GB స్టోరేజ్ ధర రూ.59,999. కానీ లాంచ్ ఆఫర్‌లో భాగంగా రూ. 49,999కే సొంతం చేసుకోవచ్చు, అయితే ఇది పరిమిత కాలపు ఆఫర్. కొనుగోలు సమయంలో HDFC, ICICI బ్యాంక్ కార్డ్ లావాదేవీలపై తగ్గింపు లభిస్తుంది. ఫోన్ డార్కెస్ట్ స్ప్రూస్, పీచ్ ఫజ్, షీర్ బ్లిస్ కలర్‌లలో అమ్మకానికి ఉంది.


Motorola Edge 50 Ultra ఫీచర్లు

* 6.7-అంగుళాల 1.5K (1,220x2,712 పిక్సెల్‌లు) LTPS pOLED స్క్రీన్‌

* 144Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్, HDR10+ కంటెంట్‌ సపోర్ట్

* ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది.

* ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతుంది.


* బ్యాక్ సైడ్ 50MP + 50MP + 64MP కెమెరాలు ఉన్నాయి.

* ముందు సెల్ఫీల కోసం 50MP కెమెరా ఉంది.

* ఫింగర్‌ ప్రింట్ స్కానర్ ఇన్-డిస్‌ప్లే‌లో అందించారు.

* భద్రత కోసం మోటో సెక్యూర్, థింక్‌షీల్డ్ సెక్యూరిటీ ఫీచర్‌లతో వస్తుంది.

* 4,500mAh బ్యాటరీని అమర్చారు.

* ఇది125W టర్బోపవర్, 50W వైర్‌లెస్, 10W రివర్స్ వైర్‌లెస్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

Similar News