Lava blaze 2 :తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్‌ ఉండే స్మార్ట్‌ఫోన్ కావాలా..!

దేశీయ స్మార్ట్ ఫోన్ కంపెనీ లావా నుంచి కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్ 'బ్లేజ్ 2' ఇండియాలో లాంచ్ అయింది. ఏప్రిల్ 18 నుంచి ఇది కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

Update: 2023-04-10 13:22 GMT
Lava blaze 2 :తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్‌ ఉండే స్మార్ట్‌ఫోన్ కావాలా..!
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ స్మార్ట్ ఫోన్ కంపెనీ లావా నుంచి కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్ 'బ్లేజ్ 2' ఇండియాలో లాంచ్ అయింది. ఏప్రిల్ 18 నుంచి ఇది కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. గ్లాస్ ఆరెంజ్, గ్లాస్ బ్లూ అనే రెండు కలర్స్‌లలో లభిస్తుంది. దీని ధర రూ. 8,999.


స్మార్ట్‌ఫోన్ 2.5D కర్వ్డ్ స్క్రీన్‌తో 6.5-అంగుళాల (16.51 cm) HD+ IPS డిస్‌ప్లేను కలిగి ఉంది. 90 Hz రిఫ్రెష్ రేట్, UniSoc T616 ప్రాసెసర్‌ ఆధారంగా పనిచేస్తుంది. ఇది 6GB RAM,128GB మెమరీతో రానుంది. Android 12 తో రన్ అవుతుంది. ఫోన్ బ్యాక్ సైడ్ 13MP AI కెమెరా, 2MP కెమెరా ఉన్నాయి. ముందు 8MP కెమెరా ఉంది. ఫోన్ 18W ఫాస్ట్ చార్జర్ సపోర్ట్‌తో 5000 mAh బ్యాటరీని కలిగి ఉంది. ఫేస్ అన్‌లాక్‌ ఫీచర్‌తో పాటు, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కూడా కలిగి ఉంది.



Tags:    

Similar News