ఇన్‌స్టాగ్రామ్‌‌‌లో కంటెంట్ కోసం కొత్త ఫీచర్‌..

Update: 2022-02-09 15:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఫోటో-షేరింగ్ ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్ మరో ఫీచర్‌ను తీసుకొచ్చింది. వినియోగదారుల కోసం పెద్ద మెుత్తంలో కంటెంట్‌‌ను తొలగించే ఫీచర్‌ను తెచ్చింది. దీని ద్వారా కంటెంట్‌ను, కామెంట్స్, లైక్‌లు, పోస్ట్‌లు ఇతర కార్యకలపాలను పెద్ద మొత్తంలో ఒకేసారి తొలగించవచ్చు. ఇదే కాకుండా ఇంకొక ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ పాత యాక్టివిటీకి సంబంధించిన కంటెంట్‌ను తేదీల వారీగా చూడడానికి ఫిల్టర్ చేయగల కొత్త ఆప్షన్‌ను పొందుతారు. ఇంతకుముందు, కంపెనీ ఖాతాలు హ్యాక్ చేయబడిన వారి కోసం 'సెక్యూరిటీ చెకప్' ను ప్రవేశపెట్టింది. ఇప్పుడు, ఈ ఫీచర్ ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులో ఉంది. ఈ మధ్యకాలంలో ఇన్‌స్టాగ్రామ్ వరుసగా కొత్త ఫీచర్‌లను విడుదల చేస్తుంది. కంపెనీ త్వరలో 'టేక్ ఎ బ్రేక్' అనే ఫీచర్ ప్రవేశపెట్టనుంది.

Tags:    

Similar News