యాపిల్ ఫోన్లు వాడుతున్న వారికి కేంద్రం తీవ్ర హెచ్చరిక!
యాపిల్ ఫోన్లు వాడుతున్న వారికి కేంద్రం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: యాపిల్ ఫోన్లు వాడుతున్న వారికి కేంద్రం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) తాజాగా దేశవ్యాప్తంగా iPhone లు వాడుతున్న వారు వెంటనే తమ ఫోన్లను అప్‌డేట్ చేసుకోవాలని పేర్కొంది. Apple iOSలో కొన్ని భద్రతా పరమైన సమస్యలు కనుగొన్నామని కాబట్టి వెంటనే తమ ఆపరేటింగ్ సిస్టంను అప్‌డేట్ చేసి iOS 16.5.1ని ఇన్‌స్టాల్ చేయాలని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది.
పాత వెర్షన్ ద్వారా హ్యాకర్స్ డివైజ్‌లోకి చొరబడి యూజర్ల డేటాను దొంగలించే అవకాశం ఉంది, కొత్త వెర్షన్‌కు మరడం వలన ఈ సమస్య నుంచి బయటపడవచ్చని ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ తెలిపింది. iPhone 6s, iPhone 7 సిరీస్, iPhone 8 సిరీస్, iPhone SE ఫస్ట్-జెన్‌లతో సహా పాత మోడల్‌లు ఈ జాబితాలో ఉన్నాయని CERT-In పేర్కొంది. iPad Air, Pro, Miniతో సహా iPad వినియోగదారులు కూడా iPadOS తాజా వెర్షన్‌కి అప్‌డేట్ చేసుకోవాలని అధికారులు సూచించారు.