Windows 11 అప్‌డేట్: సెర్చ్ బాక్సులో మరింత వేగంగా సమాధానాలు
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరిన్ని అప్‌డేట్‌లను ప్రకటించింది. Windows 11 సెర్చ్ బాక్సులో, కృత్రిమ మేధస్సు(AI)-ఆధారిత బింగ్‌ను ప్రవేశపెట్టారు
దిశ, వెబ్‌డెస్క్: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరిన్ని అప్‌డేట్‌లను ప్రకటించింది. Windows 11 సెర్చ్ బాక్సులో, కృత్రిమ మేధస్సు(AI)-ఆధారిత బింగ్‌ను ప్రవేశపెట్టారు. దీని ద్వారా వినియోగదారుల ప్రశ్నలకు గతంలో కంటే వేగంగా సెర్చ్ బాక్స్‌లో సమాధానాలు కనుగొనవచ్చని సంబంధిత అధికారులు తెలిపారు. అలాగే, iPhone వినియోగదారులు వారి Windows 11 PCకి కనెక్ట్ అవ్వడాన్ని సులభతరం చేసే కొత్త అప్‌డేట్‌లను కూడా కంపెనీ ప్రకటించింది. ఈ ఫీచర్లు విండోస్ ఇన్‌సైడర్‌లకు ప్రివ్యూగా మొదట ప్రారంభించబడ్డాయి. Windows 11లోని స్నిప్పింగ్ టూల్‌లో అంతర్నిర్మిత స్క్రీన్ రికార్డింగ్ ఫీచర్‌ను కూడా అందించారు. సరికొత్త విండోస్ 11 అప్‌డేట్‌తో ఈ కొత్త ఫీచర్లు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది.