iPhone 15 : ఐఫోన్ 15 కోసం క్యూలైన్‌లో వందల మంది

యాపిల్ కంపెనీ ఇటీవల ఐఫోన్ 15 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే

Update: 2023-09-22 14:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: యాపిల్ కంపెనీ ఇటీవల ఐఫోన్ 15 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇంతకుముందు ముందస్తు బుకింగ్‌లకు అవకాశం కల్పించిన కంపెనీ తాజాగా డెలివరీలు ప్రారంభించింది. అయితే ఈ ఫోన్లను పొందడానికి కంపెనీ స్టోర్ల వద్ద కస్టమర్లు భారీగా క్యూలైన్‌లో నిలబడ్డారు. ఢిల్లీ, ముంబైలోని కంపెనీ అధికారిక షాప్‌ల వద్ద కస్టమర్లు ఉదయం నుంచి పెద్ద క్యూలైన్లో నిలబడి ఐఫోన్ 15 సిరీస్ స్మార్ట్‌ఫోన్లతో పాటు, యాపిల్ వాచ్‌లను కూడా అందుకున్నారు.

దాదాపు వందలాది మంది కస్టమర్లు యాపిల్ స్టోర్ల ముందు నిలబడి ఉన్నారు. మొదటి సారిగా ఐఫోన్ 15 'మేక్ ఇన్ ఇండియా' లో భాగంగా ఇక్కడే తయారైంది. ఈ ఫోన్‌ను అందుకున్న చాలా మంది దేశీయంగా తయారు చేసిన ఐఫోన్ 15ని పొందడం చాలా గొప్ప విషయం, అలాగే చాలా గర్వంగా ఉందని వ్యాఖ్యానించారు. గత మోడళ్లతో పోలిస్తే ఈసారి ఐఫోన్ 15 సిరీస్‌ 50 శాతం ఎక్కువగా ముందస్తు బుకింగ్‌లను అందుకుంది. రానున్న పండుగ సీజన్ నేపథ్యంలో ఐఫోన్ 15 ధరలు మరింత తగ్గినట్లయితే అమ్మకాలు భారీగా పుంజుకుంటాయని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Tags:    

Similar News