Google Chrome : ప్రైవేట్ బ్రౌజింగ్ డేటాను తొలగించనున్న గూగుల్ .. కారణం ఏంటంటే..
గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. యూఎస్ కోర్టు సూచనల మేరకు గూగుల్ పెద్ద సంఖ్యలో యూజర్ల ప్రైవేట్ సెర్చ్ డేటాను డిలీట్ చేయనుంది.
దిశ, ఫీచర్స్ : గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. యూఎస్ కోర్టు సూచనల మేరకు గూగుల్ పెద్ద సంఖ్యలో యూజర్ల ప్రైవేట్ సెర్చ్ డేటాను డిలీట్ చేయనుంది. Google Chrome బ్రౌజర్ కు సంబంధించిన అజ్ఞాత మోడ్‌లో ప్రైవేట్ బ్రౌజింగ్ సదుపాయాన్ని అందించడానికి ఉపయోగించిందని, దాని డేటాను Google తొలగించబోతోందని తెలిపింది. అయితే, గూగుల్ బిలియన్ల కొద్దీ డేటాను ఎందుకు తొలగించాలి అనుకుంటుంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ? మరి ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఏం జరిగింది ?
గతంలో యూజర్ల డేటాను గూగుల్ ట్రాక్ చేస్తుందని ఆరోపణలు వచ్చాయి. దీని పై 2020లో కోర్టులో కేసు దాఖలైంది. గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లోని ఇన్‌కాగ్నిటో మోడ్‌లో వినియోగదారు ఏది సెర్చ్ చేసినా, దాన్ని గూగుల్ ట్రాక్ చేస్తుందని కోర్టులో క్లెయిమ్ చేశారు. యూజర్ అనుభవాన్ని మెరుగుపరచడం కోసం ఇలా చేశామని, దీని వల్ల యూజర్ తమకు నచ్చిన విషయాలను వెతకడం సులభతరం అవుతుందని గూగుల్ తెలిపింది. వినియోగదారు కావాలనుకుంటే వారి డేటా ట్రాకింగ్‌ను ఆపవచ్చని కూడా గూగుల్ తెలిపింది.
గూగుల్ సెటిల్‌మెంట్‌కు అంగీకారం.
అయితే, అజ్ఞాత మోడ్‌లో కూడా థార్డ్ పార్టీలు యాక్సెస్ పొందుతాయని కోర్టులో దావా వేసిన వారు తెలిపారు. గూగుల్ తన వినియోగదారుల జీవితాలకు సంబంధించిన ప్రైవేట్ సమాచారాన్ని ఇతరులకు అందించే పనిని చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రకటనల కోసం గూగుల్ అజ్ఞాత మోడ్ డేటాను ఉపయోగిస్తోందని ఆరోపించారు. దీంతో శోధన డేటాను తొలగించడానికి Google అంగీకరించింది. ఇలా చేయడం ద్వారా గూగుల్ 5 బిలియన్ డాలర్ల నష్టాన్ని నివారించవచ్చు.