గూగుల్ ఫొటోస్‌లో Ultra HDR క్లారిటీ

ప్రముఖ సెర్చింజన్ గూగుల్ తన ఫొటోల యాప్‌కు కొత్తగా అప్‌డేట్ విడుదల చేయాలని చూస్తున్నట్లు సమాచారం.

Update: 2023-09-05 11:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సెర్చింజన్ గూగుల్ తన ఫొటోల యాప్‌కు కొత్తగా అప్‌డేట్ విడుదల చేయాలని చూస్తున్నట్లు సమాచారం. గూగుల్ ఫొటో‌ యాప్‌లో అల్ట్రా హెచ్‌డిఆర్ సపోర్ట్‌ను తీసుకురానుంది. అత్యంత క్లారిటీతో మంచి నాణ్యత కలిగిన ఫొటోలను అందించడానికి యాప్‌ను అప్‌డేట్ చేయనున్నారు. Ultra HDR ఇమేజ్ ఫార్మాట్‌కు సంబంధించిన కొన్ని కోడ్ స్ట్రింగ్‌లు Google ఫొటోల వెర్షన్ 6.51.0.561138754లో కనిపించింది. ఆండ్రాయిడ్ 14తో ఫొటోల యాప్‌కి అల్ట్రా హెచ్‌డిఆర్ సపోర్ట్‌ను తీసుకురావాలని గూగుల్ చూస్తుంది.

ప్రస్తుతం తక్కవ క్లారిటీ కలిగిన ఫొటోలు అప్‌లోడ్ కావటం వలన వినియోగదారులకు అధిక నాణ్యత కలిగిన ఫొటోలు అందించడం లేదు. దీంతో ఈ కొత్త ఫీచర్‌తో ఆ సమస్య తీరుతుంది. అదనంగా, గూగుల్ ఫొటోలు, గూగుల్ వన్ సబ్‌స్క్రైబర్‌ల కోసం మెషిన్ లెర్నింగ్, AI-ఆధారిత ఫొటో ఎడిటింగ్ ఫీచర్‌ను కూడా తెస్తున్నారు. ఇది ఫొటోలను ఎడిటింగ్ చేయడంలో సహాయపడుతుంది.

Tags:    

Similar News