Flying Taxis: బెంగళూరులో త్వరలో ఎగిరే ట్యాక్సీలు.. 1.50 గంటల ప్రయాణం కేవలం 5 నిమిషాల్లోనే..!

భారతదేశం(India)లో ప్రతి ఏటా జనాభా పెరుగుతున్నవిషయం తెలిసిందే.

Update: 2024-10-15 13:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశం(India)లో ప్రతి ఏటా జనాభా పెరుగుతున్నవిషయం తెలిసిందే. ఈ కారణంగా ట్రాఫిక్​ సమస్య విపరీతంగా వేధిస్తోంది. దీంతో ఢిల్లీ(Delhi), హైదరాబాద్(Hyderabad), బెంగళూరు(Bangalore), ముంబై(Mumbai), చెన్నై(Chennai) లాంటి తదితర నగరాల్లో ప్రజలు గంటల తరబడి ట్రాఫిక్‌లోనే ఇరుక్కుపోవాల్సి వస్తోంది. ఇందు కోసం ఎన్ని ఫ్లై ఓవర్లు, స్కై వేలు, అండర్‌పాస్‌లు నిర్మించినా ట్రాఫిక్‌ రద్దీ మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌ కష్టాలకు చెక్​ పెట్టేందుకు బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం(Kempegowda International Airport) రెడీ అయ్యింది. త్వరలోనే ఎగిరే ట్యాక్సీలు(Flying Taxis) అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. దీని కోసం సార్లా ఏవియేషన్‌(Sarla Aviation)తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని కెంపెగౌడ ఎయిర్‌పోర్ట్‌ తన సోషల్ మీడియా వేదికైన 'ఎక్స్(X)'లో పోస్ట్ చేసింది. ట్రాఫిక్‌ రద్దీ అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి అంతరాయం లేకుండా తక్కువ సమయంలో గమ్యాన్ని చేరేందుకు ఈ ఎగిరే ట్యాక్సీలు ఉపయోగపడతాయని పేర్కొంది.

ఈ ప్రాజెక్ట్‌ అందుబాటులోకి వస్తే విమానాశ్రయం, ఎలక్ట్రానిక్‌ సిటీ.. ఇలా ట్రాఫిక్ ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో కష్టాలు తప్పుతాయని తెలిపింది. బెంగళూరులోని సెంట్రల్ జిల్లా ఇందిరానగర్‌(Indiranagar) నుంచి ఎయిర్​పోర్ట్(Airport​)కు చేరుకోవలంటే గంటా 50 నిమిషాలు పడుతోందని, అదే ఎగిరే ట్యాక్సీలతో అయితే కేవలం 5 నిమిషాలు చాలు" అని సార్లా ఏవియేషన్‌ సంస్థ సీఈఓ అడ్రియన్‌ ష్మిత్‌(Adrian Schmidt) అన్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రారంభ దశలోనే ఉందని, ఈ సర్వీసులు అందుబాటులోకి రావడానికి మరో రెండు లేదా మూడు సంవత్సరాలు పట్టే అవకాశముందని ఆయన తెలిపారు.


Similar News