బీరుతో నడిచే బైక్ ను ఎప్పుడైనా చూశారా?
సాధారణంగా కార్లు , బైక్ లు అన్నీ పెట్రోల్ లేదా డీజిల్ తో నడుస్తూ ఉంటాయి.
దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా కార్లు , బైక్ లు అన్నీ పెట్రోల్ లేదా డీజిల్ తో నడుస్తూ ఉంటాయి. టెక్నాలజీతో కూడిన ఎలక్ట్రికల్ వాహనాలు కూడా అందుబాటులోకి వచ్చాయి.మనం ఇప్పటికీ ఎలక్ట్రికల్ , పెట్రోల్ తో నడిచే వాహనాలను చూసాము. బీరుతో నడిచే బైక్ ను ఎప్పుడైనా చూసారా ? ఇది ఏంటి బీరుతో బైక్ ఎలా నడుస్తుందా అని ఆలోచిస్తున్నారా? ఇది వినడానికి నమ్మ శక్యంగా లేదు కానీ ఇది నిజమే అండి. అమెరికాకు చెందిన ఓ వ్యక్తి కేవలం బీరుతోనే నడిచే బైక్ ను తయారు చేసి అందరినీ షాక్ కు గురి చేశాడు. అతను బైక్ లో ఏర్పాటు చేసిన హీటింగ్ కాయిల్ బీర్ ను 300 డిగ్రీల వరకు మండిస్తుందట. దీంతో నాజిల్స్ లో ఆవిరి జనరేట్ అవ్వడం ద్వారా బైక్ పనిచేస్తుందని మైకల్సన్ వివరించాడు. ఇతను తయారు చేసిన బైక్ గంటకు 240 కిలో మీటర్లు వరకు వెళ్లగలదని తెలిపాడు.