స్మార్ట్ ఫోన్‌కు చిన్న హోల్ ఎందుకు ఉంటుందో తెలుసా?

ప్రస్తుతం ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోనే కనిపిస్తూ ఉంటుంది. యూత్ ఫుడ్ లేకుండానైనా ఉండగలుగుతున్నారు కానీ స్మార్ట్ ఫోన్ లేకుండా మాత్రం ఉండలేకపోతున్నారు. చిన్న వారి నుంచి పెద్దవారి వరకూ

Update: 2024-02-26 16:22 GMT

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోనే కనిపిస్తూ ఉంటుంది. యూత్ ఫుడ్ లేకుండానైనా ఉండగలుగుతున్నారు కానీ స్మార్ట్ ఫోన్ లేకుండా మాత్రం ఉండలేకపోతున్నారు. చిన్న వారి నుంచి పెద్దవారి వరకూ ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోనే యూజ్ చేస్తున్నారు. అయితే ఫోన్ అందరూ వాడుతారు. కానీ కొందరు మాత్రమే దాని గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ఆసక్తిచూపుతారు. మీరు ఎప్పుడైనా స్మార్ట్ ఫోన్‌ను పూర్తిగా పరిశీలించారా?

ప్రతి స్మార్ట్ ఫోన్‌కు చార్జింగ్ పెట్టే పాయింట్ వద్ద చిన్న హోల్ కనిపిస్తూ ఉంటుంది. మరి అసలు అక్కడ చిన్న హోల్ ఎందుకు పెట్టారు? అసలు అది పెట్టడానికి గల కారణం ఏమిటని ఆలోచించారా? కాగా, దాని గురించే ఇప్పుడు తెలుసుకుందా.

అయితే ఆ చిన్న హో‌ల్ అనేది మన చుట్టూ ఉన్న శబ్ధాన్ని నియంత్రించడానికి సహాయపడుతుందంట. వాయిస్ ని క్లియర్ చేయడానికి ఇది ఉపయోగపడుతుందని అంటున్నారు నిపుణులు. అందుకోసమే ఆ చిన్న హోల్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారంట. కానీ ఈ విషయం చాలా తక్కువ మందకి తెలుసు, ఆ హోల్ స్టైల్ కోసం పెట్టారు అని కొందరు అనుకుంటే మరికొందరు ఎందుకు పెట్టారో అని ఆలోచిస్తూ లైట్ తీసుకుంటారు.కానీ ఆ చిన్న హోల్‌కు అర్థం అదన్నమాట.


Similar News