iPhones: భారత్ నుంచి రూ. 50 వేల కోట్ల విలువైన ఐఫోన్ల ఎగుమతి..!

ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్ ఐఫోన్ల(Apple iPhones) ఎగుమతుల్లో భారత్(India) రికార్డులు సృష్టిస్తోంది.

Update: 2024-10-29 10:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్ ఐఫోన్ల(Apple iPhones) ఎగుమతుల్లో భారత్(India) రికార్డులు సృష్టిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లోనే ఇండియా నుంచి ఏకంగా రూ. 50,000 కోట్లకు పైగా విలువైన ఐఫోన్లను ఎగుమతి చేసినట్లు సమాచారం. ఇదే జోరు కొనసాగుతే గత ఆర్థిక సంవత్సరంలో నమోదైన రికార్డు బ్రేక్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. గతేడాది ఏకంగా కంపెనీ రూ. 85వేల కోట్ల విలువైన ఫోన్లను ఇతర దేశాలకు ఎగుమతి చేసింది. దీంతో ఎగుమతుల పరంగా ఆ సంస్థ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ గణనీయమైన వృద్ధి(Growth) సాధించవచ్చని తెలుస్తోంది. స్థానికంగా స్కిల్స్ ఉన్న ఉద్యోగులను ఉపయోగించుకుని.. కంపెనీ దేశంలో తన వ్యాపారాన్ని వేగంగా విస్తరించడానికి సిద్ధమవుతోంది.

ఇప్పటికే యాపిల్(Apple)కు మేజర్ సప్లైగా ఉన్న ఫాక్స్ కాన్ టెక్నాలజీ(Foxconn Technology), పెగాట్రాన్(Pegatron) కంపెనీలు టాటా ఎలక్ట్రానిక్స్(Tata Electronics)తో చేతులు కలిపాయి. టాటా ఎలక్ట్రానిక్స్ దక్షిణ భారతదేశంలో ఐఫోన్లను అసెంబ్లింగ్ చేస్తోంది. ఇటీవలే ఫాక్స్ కాన్ సంస్థ చెన్నై(Chennai)లో అసెంబ్లింగ్ యూనిట్(Assembling Unit)ను ప్రారంభించింది. కాగా గత సంవత్సరం యాపిల్ సీఈఓ టిమ్ కుక్(Apple CEO Tim Cook) ముంబై(Mumbai), న్యూఢిల్లీ(New Delhi)లోని ఆపిల్ స్టోర్స్ ప్రారంభించిన విషయం తెలిసిందే. దీంతో మన దేశంలో కూడా యాపిల్ ఫోన్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. 2030 నాటికి మన దేశంలో ఐఫోన్ల విక్రయాలు రూ.2.7 లక్షల కోట్లకు చేరుకోవచ్చని బ్లూమ్ బెర్గ్ సంస్థ అంచనా వేసింది.

Tags:    

Similar News