వాట్సాప్‌లో స్వంతంగా స్టిక్కర్‌ క్రియేట్ ఆప్షన్.. ఎలాగో తెలుసా..

ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి జీవితంలో భాగం అయిపోయింది.

Update: 2024-02-08 09:57 GMT

దిశ, ఫీచర్స్ : ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి జీవితంలో భాగం అయిపోయింది. చిన్నపిల్లల దగ్గర నుంచి మొదలు కుని పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఈ వాట్సాప్ ని వినియోగిస్తారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా ఎవరితోనైనా కనెక్ట్ అవ్వడానికి WhatsApp ఎంతో ఉపయోగపడుతుంది. అయితే నిత్యం ఒకేలాంటి సాధారణ సందేశాలు, చాటింగ్ విధానంతో కాస్త బోర్ ఫీల్ అవుతూ ఉంటారు. దీంతో చాటింగ్ సరదాగా ఉండదు. చాటింగ్ కాస్త ఫన్నీగా సాగాలంటే స్టిక్కర్‌లతో చాటింగ్ తో మసాలా జోడించాలి. అందులోనూ మీ స్వంత ఫోటోల నుండి WhatsApp స్టిక్కర్లను తయారు చేసి చాటింగ్ చేస్తే మస్తు మజా వస్తుంది. అది ఏలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

సొంతంగా WhatsApp స్టిక్కర్..

మీరు మీ స్వంత ఫోటో, స్నేహితుడు లేదా కుటుంబ సభ్యుల ఫోటోలను స్టిక్కర్‌గా మార్చాలనుకుంటే ఏదైనా ఫోటోను ఎంచుకోండి.

ఈ ఫోటోను కట్ చేసి జూమ్ చేయాలి.

తరువాత మీరు ఏదైనా ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ బ్యాక్‌గ్రౌండ్ రిమూవర్ యాప్‌ని ఉపయోగించాలి.

స్టిక్కర్ ప్యాక్‌ని క్రియేట్ చేయడానికి, WhatsAppని తెరిచి, “స్టిక్కర్లు” ఎంపికకు వెళ్లండి. "కొత్త" చిహ్నం పై క్లిక్ చేసి, " మై స్టిక్కర్ ప్యాక్" ఎంపికను ఎంచుకోండి.

స్టిక్కర్ ప్యాక్ పేరును టైప్ చేయండి మీ స్టిక్కర్ ప్యాక్ కోసం ఒక పేరు, చిహ్నాన్ని ఎంచుకోండి.

స్టిక్కర్‌ను జోడించడానికి, "జోడించు" ఎంపిక పై క్లిక్ చేసి, మీ కట్ చేసిన ఫోటోను ఎంచుకోండి.

దీని తర్వాత మీ స్టిక్కర్ ప్యాక్‌ని ప్రచురించడానికి ప్రచురించు ఎంపిక పై క్లిక్ చేయండి.

ఇప్పుడు మీరు చాటింగ్ చేస్తున్న సమయంలో స్టిక్కర్‌ను సెండ్ చేయాలనుకుంటే మీరు స్టిక్కర్ ఎంపికకు స్టిక్కర్ ని ఎంపిక చేసుకోవచ్చు.

ఐఫోన్‌లో స్టిక్కర్ చేయడానికి, మీరు ఏదైనా ఫోటో పై ఎక్కువసేపు నొక్కితే స్టిక్కర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని పై క్లిక్ చేసి మీరు పంపాలనుకుంటున్న చాట్‌లో సెండ్ చేయవచ్చు.

ఇతర యాప్‌ల నుంచి మద్దతు..

స్టిక్కర్‌లను రూపొందించడానికి మీరు థర్డ్ పార్టీ యాప్ స్టిక్కర్ మేకర్ యాప్‌లను కూడా ఉపయోగించవచ్చు. స్టిక్కర్ స్టూడియో Sticker.lyతో సహా అనేక ఉచిత స్టిక్కర్ మేకర్ యాప్‌లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

Tags:    

Similar News