క్రెడిట్ కార్డ్ లిమిట్‌కు మించి వాడుకోవచ్చా..ఆర్బీఐ ఏం చెప్తోంది?
ప్రస్తుతం క్రెడిట్ కార్డు వినియోగం అనేది విపరీతంగా పెరుగుతోంది. అత్యవసర పరిస్థితుల్లో క్రెడిట్ కార్డు అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.షాపింగ్ చేయడానికి, ఏదైనా ఫర్నిచర్ కొనుగోలు చేసే సమయంలో
దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం క్రెడిట్ కార్డు వినియోగం అనేది విపరీతంగా పెరుగుతోంది. అత్యవసర పరిస్థితుల్లో క్రెడిట్ కార్డు అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.షాపింగ్ చేయడానికి, ఏదైనా ఫర్నిచర్ కొనుగోలు చేసే సమయంలో, ఆన్ లైన్ కొనుగోళ్లకు బిల్ పేమెంట్ చేసేటప్పుడు క్రెడిట్ కార్డుతో ఈజీగా చేయోచ్చు. అందువలన ఇప్పుడు డెబిట్ కార్డుకు మించి క్రెడిట్ కార్డు లావాదేవీలు జరుగుతున్నాయి. అంతే కాకుండా క్రెడిట్ కార్డు మీద ఆఫర్లు, రివార్డ్స్ లభించడంతో చాలా మంది వీటిని ఉపయోగిస్తున్నారు.
అయితే కొంత మందికి తక్కువ లిమిట్‌తో క్రెడిట్ కార్డు లభిస్తుంటుంది. దీంతో లిమిట్ అయిపోయినా కార్డు వాడుతుంటారు. అయితే దీనిపై ఆర్బీఐ ఎలాంటి రూల్ తీసుకొచ్చిందో ఇప్పుడు చూద్దాం.క్రెడిట్ కార్డు హోల్డర్లు క్రెడిట్ లిమిట్స్‌కి మించిన ట్రాన్సాక్షన్లకు స్పష్టమైన అంగీకారం అందించాలని ఆర్ బీఐ పేర్కొంది. ఓవర్‌లిమిట్ ట్రాన్సాక్షన్లను అనుమతించే ముందు కార్డు,జారీదారులు కార్డు హోల్డర్ల నుంచి ముందస్తు అనుమతి పొందాలంట, అలానే కార్డు హోల్డర్లకు డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఓవర్‌లిమిట్ సౌకర్యాలను ఎనేబుల్ లేదా డిసేబుల్ చేసే అవకాశం ఉంది. దీంతో స్పెండింగ్‌పై ఎక్కువ నియంత్రణ ఉంటుంది.