Artificial Intelligence (AI)తో ఉద్యోగాలు కోల్పోవటం మొదలైందా..?

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వల్ల లక్షల్లో ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితులు వస్తాయని పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Update: 2023-06-05 03:36 GMT

దిశ,వెబ్‌డెస్క్:ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వల్ల లక్షల్లో ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితులు వస్తాయని పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది నిజమేనా ..నిజంగానే ఏఐ వల్ల అంత ప్రమాదకర పరిస్థితులు ఏర్పడనున్నాయా.. అంటే అవుననే చెప్పాలి. తాజాగా ఓ సంస్థ వెల్లడించిన నివేదికలో ఈ విషయం స్పష్టమవుతుంది.

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఉద్యోగాలు కోల్పోయినవారి జాబాతాను ఛాలెంజర్,గ్రే అండ్ క్రిస్మస్ సంస్థ నెలవారీ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది మేనెలలో ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వారి జాబితా బహిర్గతం చేసింది. సుమారు 4వేల మంది ఏఐతో ఉద్యోగాలు కోల్పోయినట్లు తెలిపింది. 

Tags:    

Similar News