రైల్వే స్టేషన్, బస్టేషన్‌లో మీ ఫోన్‌కు ఛార్జింగ్ పెడుతున్నారా.. చిక్కుల్లో పడ్డట్లే
మనిషి జీవితంలో సెల్‌ఫోన్ కూడా ఒక భాగమైపోయింది. సెల్ ఫోన్ లేకుండా ఎవరూ ఉండటం లేదు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ యూస్ చేస్తూనే ఉంటున్నారు. ఇక ఏ విషయం
దిశ, ఫీచర్స్ : మనిషి జీవితంలో సెల్‌ఫోన్ కూడా ఒక భాగమైపోయింది. సెల్ ఫోన్ లేకుండా ఎవరూ ఉండటం లేదు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ యూస్ చేస్తూనే ఉంటున్నారు. ఇక ఏ విషయం తెలుసుకోవాలన్నా.. ఏదైనా అత్యవసరం ఉన్నా మనం ఫోన్ ద్వారానే తెలుసుకుంటాం. అంటే ఫోన్ ఎంత అవసరమో దీని వాడకం ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇక మనం ఏదైనా ఊరు వెళ్లినా లేదా ఏదైనా పని మీద బయటకు వెళ్లిన ఫోన్ ఛార్జింగ్ ఫుల్ పెట్టుకొని, వీలైతే పవర్ బ్యాంక్, లేకపోతే ఎక్కడైనా మొబైల్‌కు చార్జింగ్ పెట్టుకొవచ్చు లే అని ఛార్జర్ తీసుకెళ్తుటాము. ఇక మనం ట్రావెల్ చేస్తున్న సమయంలో బస్‌లోనో, రైల్వేస్టేషన్‌లోనే, బస్టాండ్‌ల్లోనో ఛార్జింగ్ పాయింట్స్ వద్ద ఛార్జింగ్ పెడుతూ ఉంటాం. కానీ దీనిపై కీలక హెచ్చరికలు జారీ చేసింది రిజర్వ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
రోజు రోజుకు సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ యూజర్స్‌కు కీలక సూచనలు జారీ చేసింది. ఛార్జింగ్ కేబుల్ ద్వారా సైబర్ మోసాలు జరుగుతున్నాయంటూ తెలిపింది. అది ఎలా అంటే?పబ్లిక్ ప్లేసెస్‌లో ఏర్పాటు చేసి ఛార్జింగ్ పాయింట్ల వద్ద సైబర్ నేరస్తులు ప్రత్యేక పరికరాన్ని ఇన్ స్టాల్ చేస్తున్నారంట. దీంతో యూఎస్‌బీ కేబుల్‌ని ప్లగ్ చేయగానే మన ఫోనోలోని డేటా మొత్తం ట్రాన్స్ఫర్ అవుతోంది. దీంతో మన ఫోన్‌లోని ఫొటోస్, వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు మొత్తం సైబర్ నేరస్తుల చేతిల్లోకి వెళ్లిపోయి, వారు మన అకౌంట్‌లో ఉన్న డబ్బులు మొత్తం లాగేసుకుంటున్నారంట. అందువలన ఎట్టి పరిస్థితుల్లో పబ్లిక్ ప్లేసేస్‌లో ఛార్జింగ్ పెట్టుకోకూడదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరిస్తోంది.