వాట్సాప్ లో మరో అద్భుతమైన ఫీచర్!.. దీంతో ఆ ప్రమాదాన్ని తగ్గించవచ్చు

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలో మరో అద్భుతమైన ఫీచర్ తో మన ముందుకు రానుంది.

Update: 2024-05-23 13:24 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలో మరో అద్భుతమైన ఫీచర్ తో మన ముందుకు రానుంది. వాట్సాప్ లో ఏఐ రూపొందించిన ప్రోఫైల్ ఫోటోలను యూజర్లు సొంతంగా సృష్టించేందుకునేలా కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకు రానుంది. ఏఐ ప్రోఫైల్ ఫోటోస్ అనే పేరుతో ఈ ఫీచర్ ను పరిచయం చేయనుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ కు సంబందించిన అభివృద్ది పనులు టెస్టింగ్ దశలో ఉన్నాయి. ఈ ఫీచర్ ద్వారా మన అభిరుచికి తగ్గట్టుగా మన ఫోటోను కృత్రిమ మేద సహాయంతో స్టిక్కర్ గా సృష్టించుకొని దీనినే ప్రోఫైల్ ఫోటోగా పెట్టుకునేందుకు వీలుంటుంది. వాట్సాప్ యూజర్లు స్క్రీన్ షాట్ ఆధారంగా క్రియేట్ ఏఐ ప్రోఫైల్ పిక్చర్ అనే కొత్త పేజీలోకి వెళ్లి ఫోటో యొక్క వివరాలతో సమాచారాన్ని అందించాలి.

అనంతరం కృత్రిమ మేధ సహాయంతో యూజర్ ఇచ్చిన వివరాలకు సరిపోలిన ఫోటోను సృష్టిస్తుంది. ఈ ఫీచర్ ఫ్రోఫైల్ ఫోటోలను అనధికారికంగా వినియోగించే ప్రమాదాన్ని తగ్గించడంతో సహాయపడుతుందని వాబీటాఇన్ఫో తన నివేదికలో తెలిపింది. దీనిని తర్వాతి వర్షన్ లో అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉందని నివేదికలో పేర్కొంది. ఏఐ పవర్ స్టిక్కర్లను ఉపయోగించడం ద్వారా వినియోగదారులు తమ సందేశ అనుభవాన్ని మెరుగుపరుచుకోవడానికి వీలు కల్పిస్తుందని, దీంతో పాటు యూజర్ చదవని సందేశాల సంఖ్యను క్లియర్ చేయడానికి అనుమతించే ఫీచర్ పై కూడా వాట్సాప్ పనిచేస్తుందని నివేదిక ద్వారా తెలిసింది.


Similar News