Watsapp లో గ్యాలరీ ఇమేజ్‌లను స్టిక్కర్‌లుగా మార్చే కొత్త ఫీచర్
మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ కొత్తగా వినియోగదారుల కోసం ఒక ఫీచర్‌ను తీసుకురావాలని చూస్తోంది.
దిశ, వెబ్‌డెస్క్: మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ కొత్తగా వినియోగదారుల కోసం ఒక ఫీచర్‌ను తీసుకురావాలని చూస్తోంది. గ్యాలరీ ఇమేజ్‌లను స్టిక్కర్‌లుగా మార్చడానికి అనుమతించే టూల్‌ను లాంచ్ చేయాలని ప్రయాత్నాలు చేస్తోంది. ఈ ఫీచర్ ద్వారా కొత్త స్టిక్కర్‌లను తయారు చేయడానికి థర్డ్-పార్టీ అప్లికేషన్‌ల అవసరం లేకుండా ఇన్‌బిల్ట్‌గా ఈ సదపాయాన్ని అందివ్వనుంది.
WABetaInfo ప్రకారం, ఇది మొదటగా iOS వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ పూర్తి స్థాయిలో సక్సెస్ అయితే మిగతా యూజర్లకు విడుదల చేయనున్నారు. కొత్త టూల్ ద్వారా ఇమేజ్ నుంచి స్టిక్కర్‌ని క్రియేట్ చేయడానికి యూజర్లు చాట్‌లో ఇమేజ్‌ను పేస్ట్ చేస్తే సరిపోద్ది. ఇప్పుడు ఇది కొంత మంది iOS 16 వినియోగదారులకు అందుబాటులోకి ఉంది. ఈ ఫీచర్ స్టిక్కర్‌లను క్రియేట్ చేయడానికి టైం ఆదా చేస్తుందని కంపెనీ పేర్కొంది.