మ్యాచ్‌ల రద్దు విషయం ముందే తెలుసా..?

కరోనా మహమ్మారి కారణంగా దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్ రద్దవడం మాత్రమే కాకుండా, ఐపీఎల్ కూడా సందిగ్ధంలో పడుతుందని టీమ్ ఇండియా క్రికెటర్లకు ముందే తెలుసా..? ఇండియాకు రాకముందే ఈ పరిస్థితిని ఊహించారా..? అంటే కోచ్ రవిశాస్త్రి అవుననే అంటున్నాడు. స్కై క్రికెట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు వెల్లడించాడు. న్యూజిలాండ్‌ పర్యటనలో ఉన్న సమయంలోనే కరోనా ప్రభావం గురించి క్రికెటర్లు చర్చించుకున్నారని, దీని ప్రభావం ఇండియాపై కూడా పడొచ్చనే అనుమానాలు వ్యక్తం చేశారని ఆయన […]

Update: 2020-03-28 01:29 GMT

కరోనా మహమ్మారి కారణంగా దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్ రద్దవడం మాత్రమే కాకుండా, ఐపీఎల్ కూడా సందిగ్ధంలో పడుతుందని టీమ్ ఇండియా క్రికెటర్లకు ముందే తెలుసా..? ఇండియాకు రాకముందే ఈ పరిస్థితిని ఊహించారా..? అంటే కోచ్ రవిశాస్త్రి అవుననే అంటున్నాడు. స్కై క్రికెట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు వెల్లడించాడు.

న్యూజిలాండ్‌ పర్యటనలో ఉన్న సమయంలోనే కరోనా ప్రభావం గురించి క్రికెటర్లు చర్చించుకున్నారని, దీని ప్రభావం ఇండియాపై కూడా పడొచ్చనే అనుమానాలు వ్యక్తం చేశారని ఆయన చెప్పారు. కివీస్ నుంచి తిరిగి ఇండియా చేరుకోవడానికి సింగపూర్ మీదుగా రావల్సి వచ్చిందని.. ఆ సమయంలో క్రికెటర్లు చాలా కంగారు పడ్డారని రవిశాస్త్రి వెల్లడించాడు. కానీ ఇండియాలో అడుగుపెట్టిన తర్వాత ఊపిరి పీల్చుకున్నారని ఆయన చెప్పారు.

వర్షం కారణంగా దక్షిణాఫ్రికాతో ధర్మశాల వన్డే రద్దయింది. ఆ తర్వాత కరోనా కారణంగా సిరీస్ మొత్తాన్ని రద్దు చేసేశారు. తొలుత షాకింగ్‌గా అనిపించినా.. ఇది ముందే ఊహించిది అని సరిపెట్టుకున్నామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో క్రికెట్ గురించి ఆలోచించడం కంటే ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత గురించి ఆలోచించాలని రవిశాస్త్రి అన్నారు. ప్రజలను అప్రమత్తం చేయడంలో టీమ్ ఇండియా క్రికెటర్లు సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న కృషిని ఆయన మెచ్చుకున్నారు.

Tags: Corona, Team India Cricketers, Ravi shastri, safari one day series, Social media

Tags:    

Similar News