RTA Raids: ప్రైవేటు బస్సుల నిలువు దోపిడీ.. తెలంగాణలో ఆర్టీఏ అధికారుల మెరుపు దాడులు

సంక్రాంతి (Sankranthi) పండుగ సదర్భంగా జనం అంతా సొంతూళ్లకు పయనమయ్యారు.

Update: 2025-01-11 03:10 GMT
RTA Raids: ప్రైవేటు బస్సుల నిలువు దోపిడీ.. తెలంగాణలో ఆర్టీఏ అధికారుల మెరుపు దాడులు
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: సంక్రాంతి (Sankranthi) పండుగ సదర్భంగా జనం అంతా సొంతూళ్లకు పయనమయ్యారు. ఈ క్రమంలోనే రద్దీ కారణంగా ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు నిలువు దోపిడీకి దిగాయి. టికెట్‌ ధరపై ఏకంగా డబుల్, ట్రిపుల్ చార్జీలు వసూలు చేస్తూ అందిన కాడికి దండుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే నగర వ్యాప్తంగా ఆర్టీఏ జాయింట్ కమిషర్ (RTA Joint Commissioner) ఆధ్వర్యంలో అధికారులు ప్రైవేటు బస్సులపై మెరుపు దాడులు చేస్తున్నారు.

ముఖ్యంగా హైదరాబాద్ (Hyderabad)-విజయవాడ (Vijayawada) జాతీయ రహదారిపై నడుస్తోన్న ప్రైవేటు బస్సులపై ఫోకస్ పెట్టిన అధికారులు ఎల్‌బీ నగర్ (LB Nagar ), రాజేంద్ర నగర్‌ (Rajendra Nagar)లో ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. అదేవిధంగా పెద్ద అంబర్‌పేట్ (Pedda Amberpet), ఆరాంఘర్ (Aaramghar) చౌరస్తా వద్ద కూడా ఆర్టీఏ తనిఖీలు కొనసాగుతున్నాయి. సేఫ్టీ (Safety), సరైన పర్మిట్ (Permit) పేపర్లు లేని కారణంగా ఎల్‌బీ నగర్‌ (LB Nagar)లో 20 బస్సులు, రాజేంద్రనగర్ (Rajendra Nagar)లో దాదాపు 10 ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ అధికారులు కేసులు నమోదు చేసి సీజ్ చేశారు. ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు ప్రైవేటు బస్సుల యాజమాన్యాలను హెచ్చరించారు.   

Tags:    

Similar News