స్కూల్‌కు ఎందుకు వెళ్లాలి.. పరీక్షలు రద్దయ్యాక క్లాసులెందుకు?
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతుండంతో విద్యార్థులను కరోనా భారీ నుంచి కాపాడేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టింది. పాఠశాలకు విద్యార్థులు హాజరుకావద్దని పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నామని ప్రకటించారు. టీచర్లు మాత్రం తప్పని సరిగా పాఠశాలకు వెళ్లి ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. పరీక్షలు రద్దయ్యాక విద్యార్థులకు ఆన్ లైన్ తరగతులు ఏం అవసరమని ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. పాఠశాలలకు హాజరవుతున్న టీచర్లు కోవిడ్ బారీన పడుతున్నాకాని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని […]
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతుండంతో విద్యార్థులను కరోనా భారీ నుంచి కాపాడేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టింది. పాఠశాలకు విద్యార్థులు హాజరుకావద్దని పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నామని ప్రకటించారు. టీచర్లు మాత్రం తప్పని సరిగా పాఠశాలకు వెళ్లి ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. పరీక్షలు రద్దయ్యాక విద్యార్థులకు ఆన్ లైన్ తరగతులు ఏం అవసరమని ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. పాఠశాలలకు హాజరవుతున్న టీచర్లు కోవిడ్ బారీన పడుతున్నాకాని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పాఠశాలకు హాజరుకావలని ఆదేశం
విద్యార్థుల గురిచిన ఆలోచించిన ప్రభుత్వం టీచర్లను కాపాడేందుకు మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. విద్యార్థులు లేకున్నాకాని పాఠశాలకు టీచర్లు తప్పని సరిగా హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతిరోజు ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని సూచించారు. పరీక్షలకు రద్దు చేసినప్పటికీ విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహిచాలని అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటుంది. పరీక్షలు లేకపోవడంతో ఆన్ లైన్ తరగతులకు హాజరయ్యేదుకు విద్యార్థులు ఆసక్తి కనబర్చడం లేదు. దీంతో పాఠశాలకు హాజరైం ఏం పనిచేయాలని ప్రభుత్వాన్ని ఉపాధ్యాయ సంఘం నాయకులు ప్రశ్నిస్తున్నారు.
కరోనా బారిన పడతున్న ప్రభుత్వ టీచర్లు
టీచర్ల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో చాలా మంది సిబ్బంది కరోనాబారిన పడుతున్నారు. పాఠశాలలకు హాజరవుతున్న ఉపాధ్యాయులకు ఒకరి నుంచి మరొకరికి వ్యాధి వేగంగా సోకుతుంది. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణిస్తున్న టీచర్లు కరోనా వాహకులుగా మారుతున్నారు. వ్యాధి తీవ్రత పెరుగుతున్నాకానీ టీచర్ల పై ప్రభుత్వానికి ఎందుకు కనికరం రావడం లేదని ఉపాధ్యాయులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. జీతాలు చెల్లిస్తున్నాం కాబట్టి తప్పని సరిగా విధుల నిర్వహించాలనే ధోరణిలో ప్రభుత్వం ప్రవర్తిస్తుందని మండిపడుతున్నారు.
ప్రభుత్వ నిర్ణయాలతో గందరగోళం
మార్చి 23న విద్యార్థులకు సెలవులు ప్రకటించనప్పటి నుంచి టీచర్లు ఆన్‌లైన్ తరగుతుల ద్వారా పాఠాలను బోధించారు, అనంతరం పరీక్షలు రద్ధు చేసినప్పటి నుంచి విద్యార్థుల ఆన్‌లైన్ తరగతులకు హాజరయ్యేందుకు ఆసక్తి చూపడం లేదు. ఒక్కరూ ఆన్‌లైన్ తరగతులకు హాజరవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఎలాంటి కార్యకలాపాలు లేని పాఠశాలకు ఎందుకు హాజరుకావాలో ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదు. కరోనా టీచర్లను బలితీసుకోకముందే ప్రభుత్వం తేరుకొని వెంటనే సెలవులు ప్రకటించాలి. – రవీందర్, టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు