కరోనాపై పుకార్లు.. టీచర్ అరెస్ట్

దిశ, వెబ్ డెస్క్: కోవిడ్-19 వ్యాప్తి పై సోషల్ మీడియాలో పుకార్లు పోస్ట్ చేసిన ఓ ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశాలోని కలహండి జిల్లాలో గోలముండా బ్లాక్ పరిధిలో ఉండే దుడ్కెల్ గ్రామానికి చెందిన బిందు మహానంద అనే ఉపాధ్యాయుడు ఖలికాని గ్రామానికి చెందిన యువతకు కరోనా వైరస్ సోకినట్లు ఆయన సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేశాడు. దీంతో ఆ ప్రాంతంలో ఆందోళనకర వాతావరణం నెలకొన్నది. విషయం తెలుసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ […]

Update: 2020-03-16 01:53 GMT

దిశ, వెబ్ డెస్క్: కోవిడ్-19 వ్యాప్తి పై సోషల్ మీడియాలో పుకార్లు పోస్ట్ చేసిన ఓ ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశాలోని కలహండి జిల్లాలో గోలముండా బ్లాక్ పరిధిలో ఉండే దుడ్కెల్ గ్రామానికి చెందిన బిందు మహానంద అనే ఉపాధ్యాయుడు ఖలికాని గ్రామానికి చెందిన యువతకు కరోనా వైరస్ సోకినట్లు ఆయన సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేశాడు. దీంతో ఆ ప్రాంతంలో ఆందోళనకర వాతావరణం నెలకొన్నది. విషయం తెలుసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. పుకార్లు, తప్పుడు సమాచారం వ్యాప్తి చేసి భయాందోళనలు సృష్టించొద్దని పోలీసులు చెప్పారు. రెండురోజుల క్రితం జిల్లాలో కరోనా వైరస్‌పై పుకార్లు వ్యాప్తి చేసినందుకు రాయగడ పోలీసులు అంబడోలా ప్రాంతానికి చెందిన సత్యనారాయణ సమల్(32)ను అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News