మహిళా హోం మంత్రి ఉన్నా.. వేధింపులే
దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో తనపై అసభ్య పదజాలంతో వేధిస్తున్నారని టీడీపీ మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. త్వరలో జాతీయ మహిళ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానని అన్నారు. సాక్షాత్తు మహిళ కమిషన్ చెప్పిన కేసులు నమోదు చెయ్యడం లేదన్న ఆమె ఆరోపించారు. తూర్పు గోదావరికి చెందినా జోనీ కుమారి ఆత్మహత్య యత్నం గురించి ప్రస్తావించిన ఆమె వైసీపీలో మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా ..? అని ప్రశ్నించారు. పేటీఎం బ్యాచ్ టీడీపీ మహిళలపై […]
దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో తనపై అసభ్య పదజాలంతో వేధిస్తున్నారని టీడీపీ మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. త్వరలో జాతీయ మహిళ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానని అన్నారు. సాక్షాత్తు మహిళ కమిషన్ చెప్పిన కేసులు నమోదు చెయ్యడం లేదన్న ఆమె ఆరోపించారు. తూర్పు గోదావరికి చెందినా జోనీ కుమారి ఆత్మహత్య యత్నం గురించి ప్రస్తావించిన ఆమె వైసీపీలో మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా ..? అని ప్రశ్నించారు.
పేటీఎం బ్యాచ్ టీడీపీ మహిళలపై అసభ్య పదజాలంతో ట్రోల్ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. మహిళ హోమ్ శాఖ మంత్రిగా ఉన్నా రాష్ట్రంలో మహిళలకు న్యాయం జరగడం లేదని, రాఖీ పౌర్ణమి రోజైనా దిశా చట్టానికి చట్టబద్దత కల్పించి మహిళలకు భరోసా ఇవ్వాలని అన్నారు.