పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి: మాజీమంత్రి సోమిరెడ్డి
దిశ, ఏపీ బ్యూరో: కేంద్రంతో సహా పలు రాష్ట్రాలు పెట్రోలు ధరలు తగ్గించినా జగన్ మాత్రం ఎప్పటిలాగే తన రివర్స్ విధానాన్ని కొనసాగిస్తున్నారని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. పన్నులు తగ్గించకపోవడంతో పెట్రోల్ బంకులు మూతపడుతున్నాయని ఆరోపించారు. పెట్రోల్, బ్రాండెడ్ మద్యం కోసం ఇక్కడి ప్రజలు సరిహద్దులు దాటుతుంటే.. గంజాయి కోసం మాత్రం దేశం మెుత్తం ఏపీ వైపు చూస్తుందని మాజీమంత్రి విమర్శించారు. ఇటీవల పెట్రో ఉత్పత్తులపై కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందని.. రాష్ట్రాలు కూడా […]
దిశ, ఏపీ బ్యూరో: కేంద్రంతో సహా పలు రాష్ట్రాలు పెట్రోలు ధరలు తగ్గించినా జగన్ మాత్రం ఎప్పటిలాగే తన రివర్స్ విధానాన్ని కొనసాగిస్తున్నారని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. పన్నులు తగ్గించకపోవడంతో పెట్రోల్ బంకులు మూతపడుతున్నాయని ఆరోపించారు. పెట్రోల్, బ్రాండెడ్ మద్యం కోసం ఇక్కడి ప్రజలు సరిహద్దులు దాటుతుంటే.. గంజాయి కోసం మాత్రం దేశం మెుత్తం ఏపీ వైపు చూస్తుందని మాజీమంత్రి విమర్శించారు.
ఇటీవల పెట్రో ఉత్పత్తులపై కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందని.. రాష్ట్రాలు కూడా వ్యాట్‌ను తగ్గించాలంటూ కేంద్రం చేసిన విజ్ఞప్తిని అనేక రాష్ట్రాలు పాటించాయని ఆయన గుర్తు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా పెట్రో ఉత్పత్తులపై పన్నును తగ్గించాయని, ఏపీ ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంలో త్వరగా ఓ నిర్ణయం తీసుకోవాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.