అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటాం

దిశ, మునుగోడు: చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే రాబోయే అసెంబ్లీ సమావేశాలు అడ్డుకుంటామని తెలంగాణ టీడీపీ అధ్యక్షులు ఎల్.రమణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గత నలభై రోజులుగా మునుగోడు నియోజకవర్గంలోని చండూరు, నారాయణపురం మండల కేంద్రంలో జరుగుతున్న దీక్షా శిబిరాలను ఆదివారం ఎల్.రమణ సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ… స్వాతంత్ర ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో పద్మశాలీలు క్రియాశీలకంగా పాల్గొన్నారని, అలాంటి వారు నేడు ఆకలి చావులతో అలమటిస్తూంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించకుంటే ప్రగతి భవన్ […]

Update: 2020-09-06 08:16 GMT

దిశ, మునుగోడు: చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే రాబోయే అసెంబ్లీ సమావేశాలు అడ్డుకుంటామని తెలంగాణ టీడీపీ అధ్యక్షులు ఎల్.రమణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గత నలభై రోజులుగా మునుగోడు నియోజకవర్గంలోని చండూరు, నారాయణపురం మండల కేంద్రంలో జరుగుతున్న దీక్షా శిబిరాలను ఆదివారం ఎల్.రమణ సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ… స్వాతంత్ర ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో పద్మశాలీలు క్రియాశీలకంగా పాల్గొన్నారని, అలాంటి వారు నేడు ఆకలి చావులతో అలమటిస్తూంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు.

ఇకనైనా ప్రభుత్వం స్పందించకుంటే ప్రగతి భవన్ గోడలు కూడా బద్దలు కొడతామని ప్రభుత్వాన్ని విమర్శించారు. మంత్రి కేటీఆర్ తన సొంత నియోజకవర్గమైన సిరిసిల్లలో చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకుంటే అతని దహన సంస్కారాలు చందాలు వసూలు చేసి చేయాల్సిన దౌర్భాగ్య స్థితికి ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి చేనేత కార్మికులకు జీవన భృతి కింద నెలకు రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే పద్మశాలీలతో కలిసి మరో పోరాటానికి సిద్ధం కావాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Tags:    

Similar News