ఏపీ డిప్యూటీ సీఎం పాకీ పని.. అదే పని మంచిదన్న టీడీపీ
దిశ, ఏపీ బ్యూరో: ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, టీడీపీ నేతల మధ్య గత కొన్నిరోజులుగా వార్ నడుస్తోంది. చంద్రబాబు, లోకేశ్‌లను టార్గెట్ చేస్తూ డిప్యూటీ సీఎం నారాయణస్వామి తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో టీడీపీకి చెందిన కొందరు నారాయణ స్వామిని టార్గెట్ చేస్తూ విరుచుకుపడుతున్నారు. దీంతో ఇరువురు మాటల యుద్ధం కొనసాగుతుంది. అయితే మంగళవారం చంద్రబాబు, నారా లోకేశ్‌లపై మరోసారి విరుచుకుపడ్డారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. చంద్రబాబు, లోకేశ్‌లు వచ్చే ఎన్నికల్లో ఏ […]
దిశ, ఏపీ బ్యూరో: ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, టీడీపీ నేతల మధ్య గత కొన్నిరోజులుగా వార్ నడుస్తోంది. చంద్రబాబు, లోకేశ్‌లను టార్గెట్ చేస్తూ డిప్యూటీ సీఎం నారాయణస్వామి తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో టీడీపీకి చెందిన కొందరు నారాయణ స్వామిని టార్గెట్ చేస్తూ విరుచుకుపడుతున్నారు. దీంతో ఇరువురు మాటల యుద్ధం కొనసాగుతుంది. అయితే మంగళవారం చంద్రబాబు, నారా లోకేశ్‌లపై మరోసారి విరుచుకుపడ్డారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.
చంద్రబాబు, లోకేశ్‌లు వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా ఒంటరిగా నిలబడి కనీసం రెండు సీట్లు గెలిచినా చంద్రబాబు ఇంట్లో శాశ్వతంగా పాకీపని చేయడానికి సిద్ధమని నారాయణ స్వామి సవాల్ విసిరారు. చంద్రబాబుకు ఏ ఎన్నికల్లో కూడా ఒంటరిగా నిలబడి గెలిచే దమ్ము ధైర్యం లేవని విమర్శించారు. మిత్ర పక్షం పేరుతో బీజేపీతో ఒకసారి, వామపక్షాలతో, జనసేనతో ఒక్కోసారి ఒక్కో పార్టీతో టీడీపీ ఎన్నికల బరిలో నిలుస్తుందని విమర్శించారు. నారాయణ స్వామి సవాల్‌పై టీడీపీ నేతలు ఘాటుగా బదులిచ్చారు. టీడీపీ, వైసీపీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలతో ఏపీ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి.
మూన్నెల్లే నీ ముచ్చట మూగజీవి నారాయణ స్వామి : వర్ల రామయ్య ఆగ్రహం
డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ధైర్యంగా మీ ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీస్‌లో అడుగు పెట్టే దమ్ములేని పిరికివాడు ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి అని విమర్శించారు. రాజకీయ ఉద్దంఢుడైన చంద్రబాబుపై అవాకులు, చవాకులు పేలడం నీ రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం అంటూ మండిపడ్డారు. ‘సూర్యడు మీద ఉమ్మేస్తున్నావు నారాయణ స్వామి, అది నీ ముఖమ్మీదే పడుతుంది. నేల విడిచి సాము చేయకు. ఇంక, మూన్నెల్లే నీ ముచ్చట మూగజీవీ’ అంటూ వర్ల రామయ్య ట్విటర్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
సవాలు చేసి పాకీపనికి కుదిరితే అదే పని శాశ్వతం అవుతుంది: మాజీమంత్రి జవహర్
చంద్రబాబు, లోకేశ్‌లపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వ్యాఖ్యలపై మాజీమంత్రి జవహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే పని లేక ఇంట్లో పాచి పనితో సరిపోతుందని ఎద్దేవా చేశారు. ఇక సవాలు చేసి పాకీపనికి కుదిరితే అదే పని శాశ్వతం అవుతుందని గుర్తుంచుకోవాలని ఎద్దేవా చేశారు. ముందు దళితులపై జరుగుతున్న దాడులను చూడు.. ఆ తర్వాత మా సంగతి మాట్లాడుదువు గానీ అంటూ విరుచుకుపడ్డారు. మంత్రిగా తన పని తాను చెయ్యకుండా చంద్రబాబును విమర్శించడం సిగ్గుచేటన్నారు. టీడీపీ ఇచ్చిన మాటకు కట్టుబడి నిలబడుతుందని..వైసీపీలా కాదన్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామని చెప్పి, ఇప్పటి వరకు తమరు ఏం చేశారో చెప్పాలని మాజీమంత్రి జవహర్ నిలదీశారు. మెుత్తానికి టీడీపీ, వైసీపీ నేతల మధ్య నెలకొన్న విమర్శలు తారా స్థాయికి చేరడంతో రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి.